telugu navyamedia
రాజకీయ

‘రాష్ట్రపతి కాదు.. రాష్ట్రపత్ని’ అధీర్ వ్యాఖ్యలపై పార్లమెంటులో దుమారం..

*రాష్ర్ట‌ప‌తిని కాంగ్రెస్ అవ‌మానించ‌ద‌న్న బీజేపీ
*సోనియా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని బీజేపీ ఎంపీల నిర‌స‌న‌
*ఎంపీ అధిర్‌ రంజన్‌ వ్యాఖ్య‌ల‌పై తీవ్ర‌ దుమారం

కాంగ్రెస్ అధీర్ రంజన్ చౌధురీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని భాజపా డిమాండ్ చేస్తుంది.

రాష్ట్రపతి పదవిలో ఓ తోలుబొమ్మను కూర్చోబెట్టారని, ఆమె రాష్ట్రపతి కాదని, ‘రాష్ట్రపత్ని’ అంటూ కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. .

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాంగ్రెస్‌ అవమానించింది. ఈ వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాల్సిందే అని స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్ మండిప‌డ్డారు.

Congress's Adhir Ranjan Chowdhury's Remark Rashtrapatni Sparks Uproar In Parliament

గిరిజన, దళిత, మహిళా వ్యతిరేకంగా కాంగ్రెస్ పని చేస్తోంద‌ని, ప్రధాని మోదీ.. గిరిజనులకు అత్యుత్నత స్థాయి గౌరవం ఇస్తే.. మీరు ఇంతలా అవమానిస్తారా? అంటూ స్మృతి ఇరానీ మండిప‌డ్డారు.

దేశ అత్యున్నత పదవిలో ఉన్న ఓ వ్యక్తిని అవమానించేందుకు సోనియా గాంధీ తన సభ్యులకు అనుమతి ఇచ్చినట్లు అయ్యిందని స్మృతి ఇరానీ మండిపడ్డారు.

ఈ క్రమంలో ఒకానొక టైంలో బీజేపీ సభ్యులంతా లేచి.. స్మృతి ఇరానీకి మద్ధతుగా గళం వినిపించారు. ఈ గందరగోళం నడుమే లోక్‌సభ 12 గం. దాకా వాయిదా పడింది.

పార్లమెంట్‌ ఆవరణలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన తోటి ఎంపీలతో కలిసి ఫ్లకార్డులు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. అధిర్‌ రంజన్‌వి సెక్సీయెస్ట్‌ కామెంట్లు అని, ఇది గిరిజన బిడ్డకు జరిగిన అవమానం అంటూ ఆమె పేర్కొన్నారు.

మరో వైపు అధీర్ రంజన్ చౌధురి పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడారు.కేవలం పొరపాటున మాట్లాడిన మాటపై బీజేపీ రాద్దాంతం చేస్తోందన్నారు.

అయితే ..‘తన ‍వ్యాఖ్యలు తప్పేనని, ఉరి తీస్తే ఉరి తీయండంటూ’ ఆవేశంగా అధిర్‌ రంజన్‌ మాట్లాడారాయన. అంతే కానీ బీజేపీకి మాత్రం క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు.

ఇదే విషయంపై సోనియా గాంధీని మీడియా ప్రశ్నించగా ఇప్పటికే అధీర్ రంజన్ చౌధురి క్షమాపణ చెప్పారని ఆమె తెలిపారు . అయితే.. అధికార పక్షం శాంతించలేదు.ఇది రాష్ట్రపతికి జరిగిన అవమానంగా భావిస్తున్నామని సోనియా గాంధీ.. ఉభయసభలను ఉద్దేశించి క్షమాపణలు చెప్పేంత వరకూ ఆందోళనలను ఆపమని బీజేపీ ఎంపీలు చెబుతున్నారు.

Related posts