telugu navyamedia
క్రైమ్ వార్తలు

చీకోటి ప్రవీణ్ ,మాధవరెడ్డి ఇళ్లలో ముగిసిన ఈడీ సోదాలు..నోటీసులు జారీ

*హైద‌రాబాద్ క్యాసినో కేసులో ఈ డీ ద‌ర్యాప్తు
*చీకోటీ ప్ర‌వీణ్‌, మాధ‌వ రెడ్డికి ఈడీ నోటీసులు
సోమ‌వారం ఈడీ ఆఫీసుకు రావాల‌ని ఆదేశం

కేసీనో నిర్వహించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్ , మాధవరెడ్డి ఇళ్లలో ఈడీ అధికారుల సోదాలు ముగిశాయి.. అనంత‌రం విచారణకు రావాల్సిందిగా ఈడీ అధికారులు వారికి నోటీసులు ఇచ్చారు.

చీకోటి ప్రవీణ్ ఇంటి నుండి లాప్ టాప్ లు , మొబైల్ ఫోన్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. కింగ్ చీకోటి ప్రవీణ్‌.. క్యాసినో మాస్టర్ మాధవరెడ్డి.. ఈ ఇద్దరి ఇళ్లు, ఫామ్ హౌసులు, ఆఫీసుల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి క్యాసినో కేసులో ఈడీ కీలక ఆధారాలు సంపాదించింది. చాలా మంది ప్రముఖులు, సెలబ్రిటీలతో ప్రవీణ్‌కు సంబంధాలున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు.

క్యాసినోకు ముందు సినీ తారలతో చీకోటి ప్రమోషన్ వీడియోలు తీసి వదులుతాడు. ఇదంతా సీక్రెట్‌గా జరుగుతుంది. వారి వాట్సాప్‌ గ్రూపుల్లోనే ప్రమోషన్లు జరుగుతాయి. ఇటీవల నేపాల్‌లో జరిగిన క్యాసినోలకు 10 మంది టాలీవుడ్, బాలీవుడ్ హీరో, హీరోయిన్స్ హాజరైనట్లు ఈడీ గుర్తించింది.

చీకోటి నిర్వహించే పేకాటలో టేబుల్ ప్రారంభమే 25 లక్షలతో ఉంటుందని సమాచారం. అంతేకాక, గోవా, నేపాల్, శ్రీలంక, ఇండోనేషియా, బ్యాంకాక్ లలో కూడా చీకోటి క్యాసినోలకు పలువురిని తీసుకెళ్లినట్లు ఈడీ అధికారుల విచారణలో తేలింది.

తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలతో చికోటికి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు చీకోటి అండ్‌ మాధవరెడ్డి.. నెలలో నాలుగు,ఐదు రోజులు క్యాషినో నిర్వాహణ చేస్తున్నట్లు విచారణలో బయటికొచ్చింది. 

అంతేకాకుండా క్యాసినోకు రావాలంటూ పలువురు హీరోయిన్లు చేసిన ప్రమోషన్‌ వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ప్రమోషన్లకు సంబంధించి క్యాసినో నిర్వాహకుల నుంచి సినీ తారలకు అందిన పేమెంట్‌.. ఇతర ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆరా తీస్తున్నట్లు సమాచారం.

ఇటీవల జరిగిన ఆయన పుట్టినరోజు వేడుకలకు పలువురు సినీ తారలు మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీస్ ఉన్నతాధికారులు, జైళ్ల శాఖకు చెందిన ఉన్నతాధికారులు కూడా హాజరు అయినట్లు సమాచారం. సోషల్‌ మీడియా ద్వారా క్యాసినో వీడియోలను ప్రవీణ్‌ ప్రచారం చేసినట్లు తేల్చారు. జనవరిలో గుడివాడ గ్యాంబ్లింగ్‌లోనూ ఆయన హస్తం ఉన్నట్లు గుర్తించారు.

 

Related posts