telugu navyamedia
తెలంగాణ వార్తలు

రాజ‌గోపాల్‌రెడ్డి బీజేపీలో చేర‌డం ఖాయం..త్వ‌ర‌లో ఆ జిల్లా నుంచి భారీగా చేరికలు ఉంటాయి

రాజ‌గోపాల్‌రెడ్డి బీజేపీలో చేర‌డం ఖాయం
ఖ‌మ్మం నుంచి నేత‌లు మాతో ట‌చ్‌లో ఉన్నారు..
ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తే టీఆర్ ఎస్ నేత‌లు తిరుగుబాటు చేస్తారు.

తెలంగాణలో రాజకీయాలు ఎన్నికలకు ముందే వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి.. బీజేపీలో చేరడం దాదాపు ఖరారైంది.

ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండితో రాజగోపాల్‌ రెడ్డి చర్చలు జరిపారు. అనంతరం బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలో చేర‌డం ఖ‌య‌మ‌ని అని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఖమ్మం, నల్లగొండ జిల్లా నుంచి బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని స్ప‌ష్టం చేశారు. అలాగే, మునుగోడు అభ్యర్థి ఎవరనేది పార్టీలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామన్నారు.

ఖ‌మ్మం నుంచి నేత‌లు మాతో ట‌చ్‌లో ఉన్నార‌ని, తెలంగాణ‌కు ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తే టీఆర్ ఎస్ నేత‌లు కేసీఆర్‌పై తిరుగుబాటు చేస్తార‌ని వెల్ల‌డించారు.

దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేదు..మహాబూబ్ నగర్ ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ బలమెంటో అర్థం అయింది. నాగార్జున సాగర్, దుబ్బాక, హుజురాబాద్‌ ఎన్నికలతో కాంగ్రెస్ ఖతమైందని ఎద్దేవ చేశారు. ఆర్థిక నేరాలు చేస్తే ఈడీ తప్పకుండా ప్రశ్నిస్తుంది. ఈడీ విచారణ చేయవద్దని కాంగ్రెస్ నేతలు అనడం హాస్యాస్పదం అని చురకలు అంటించారు.

తెలంగాణ ప్ర‌జ‌లు అభివృద్ధి చెందాల‌న్నా..ప్ర‌జ‌లు సుఖ‌సంతోషాల‌తో ఉండాల‌న్నా..ఈ అప్పులు ప్ర‌భుత్వం పోవాల‌న్నా.. రాష్ట్రం లో బీజేపీ ప్ర‌భుత్వం రావాలి..మోడీ గారి నాయ‌కత్వం ఏర్పాటు అవ్వాల‌ని బండి అన్నారు

Related posts