telugu navyamedia
ఆంధ్ర వార్తలు

వెయ్యి కోట్లో, రెండు వేల కోట్లో అయితే మేమే ఇచ్చేవాళ్లం..అంత కాబట్టే ..కేంద్రంతో యుద్ధం చేస్తున్నాం..

*కేంద్రం ఆశించిన స్థాయికి డ‌బ్బులు ఇవ్వ‌క‌పోతే..
*వేయ్య‌కోట్లో ..రెండు వేలు కోట్లో అయితే మేమే ఇచ్చేవాళ్లం..200కోట్లు వ్య‌వ‌హారం
*సెప్టెంబర్‌లోగా పోలవరం పరిహారం అందుతుంది

పోలవరం విషయంలో కేంద్రంతో యుద్ధం చేస్తున్నామ‌ని ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నాలుగు ముంపు మండలాలతో రెవిన్యూ డివిజన్‌ ఏర్పాటు ఉంటుందని తెలిపారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీకి రూ.20 వేల కోట్లు అవసరం.. ఆ ప్యాకేజీ కోసం కోసం కేంద్రంతో కుస్తీ పడుతున్నామ‌ని అన్నారు.

వెయ్యి కోట్లో, రెండు వేల కోట్లో అయితే మేమే ఇచ్చేవాళ్లం. 20 కోట్లు కాబట్టే కేంద్రం సాయం చేయాల్సిందే. పోలవరం పునరావాసం అంతా కేంద్రం చేతుల్లోనే ఉంది. ఆ సాయం కోసం కేంద్రంతో యుద్ధం చేస్తున్నామన్నారు.. ఆ యుద్ధం కొనసాగుతోంది అన్నారు.

వరద బాధితులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చూసుకున్నామని అన్నారు. సెప్టెంబర్‌ లోగా పోలవరం ముంపు బాధితులకు పరిహారం అందిస్తామని, నిర్వాసితులకు పరిహారం అందాకే.. పోలవరంలో నీళ్లు నింపుతామని..నిర్వాసితులకు సీఎం జగన్‌ భరోసా ఇచ్చారు.. కేంద్రంపై ఒత్తిడి పెంచుతాం.. నిర్వాసితులను ఆదుకుంటాం అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు..

బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మండలం కోయుగూరులో వరద బాధితులతో సీఎం జగన్‌ పరామర్శ కొనసాగింది.. వారి కష్టాలను తెలుసుకుంటున్నారు. ఎవరూ భయపడొద్దని.. తాను ఉన్నాను అనే భరో కల్పిస్తున్నారు.

వరదలతో నష్టపోయిన ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని, ప్రతీ ఒక్కరికీ పరిహారం అంది తీరుతుందని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. పారదర్శకంగా బాధితులకు పరిహారం అందించామ‌ని. అందరికీ రేషన్‌, ఇంటింటికీ రూ. 2 వేలు అందించాం. అధికారులను భాగస్వామ్యం చేసి.. కావాల్సిన వనరులు సమకూర్చాం అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అందరికీ సహయం, అన్ని సౌకర్యాలు అందాయని కోయుగూరు వరద బాధితులు తెలిపారు.

Related posts