telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీ టూరిజం పై దృష్టి పెట్టిన మంత్రి…

విశాఖపట్నం టూరిజం పై కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ వీడియో కాన్ఫెరెన్సు నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి ఆ వీడియో కాన్ఫెరెన్సు లో మంత్రి అవంతి శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు. మంత్రి అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ… కోవిడ్ నేపథ్యంలో టూరిజం స్పాట్స్ కి వచ్చే సందర్శకులకు తీసుకోవాల్సిన చర్యలు పై చర్చించాం అని చెప్పారు. కోవిడ్ నిబంధనలు తు చ తప్పకుండా పాటిస్తున్నాం అన్నారు. రాష్ట్రం నుంచి వెయ్యికోట్ల రూపాయల టూరిజం ప్రాజెక్టులకు ప్రతిపాదనలు పంపాము అని తెలిపారు.స్వదేశీ దర్శనం పధకం, ప్రసాదం స్కీం ప్రవేశ పెట్టాము అని వివరించారు. రాష్ట్రంలో నాలుగు దేవాలయాలకు ప్రాజెక్టు ప్రతిపాదనలు పంపగా..సింహాచలం ప్రాజెక్టు కు ప్రసాదం పథకం అమోదం లభించింది. అని అవంతి పేర్కొన్నారు.కేంద్ర సహకారం తో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేస్తాము. రిషికొండ బీచ్ కి బ్లూ ఫాగ్ గుర్తింపు రావడం ఆనందదాయకం అని హర్షం వ్యక్తం చేసారు. వచ్చే వారం నూతన టూరిజం పాలసీని ప్రకటిస్తాము, విదేశీ పర్యాటకులు సందర్శించే రూపకల్పన చేస్తాము అని అన్నారు.

Related posts