telugu navyamedia
తెలంగాణ వార్తలు

పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామాకు రాజ్‌గోపాల్‌రెడ్డి నిర్ణ‌యం..

*పార్టీ కి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామాకు రాజ్‌గోపాల్‌రెడ్డి నిర్ణ‌యం
*బండిసంజ‌య్‌, కిష‌న్‌రెడ్డి, వివేక్‌తో రాజ్‌గోపాల్‌రెడ్డి చ‌ర్చ‌లు
*బీజేపీలో చేర‌డానికే మొగ్గు చూపిన రాజ్‌గోపాల్‌రెడ్డి
*మూడురోజుల్లో ఢిల్లీకి రాజ్‌గోపాల్‌రెడ్డి, బీజేపీ నేత‌లు
*ఫ‌లించ‌ని భ‌ట్టివిక్ర‌మార్క‌ దౌత్యం

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ‌లో బీజేపీ ఆకార్ష‌న్ కొన‌సాగుతోంది.

బీజేపీలో రాజగోపాల్ రెడ్డి చేరిక దాదాపుగా ఖాయమైంది. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేందుకే ఆయన మొగ్గుచూపుతున్నారు.

మంగళవారం మనుగోడు నియోజకవర్గంలోని ముఖ్యనేతలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమావేశమయ్యారు. బీజేపీలో చేరే అంశంపై చర్చించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడాల్సి వస్తుందో వారికి వివరించారు. తాను బీజేపీలో చేరుతున్నట్లు కేడర్‌కు సంకేతాలు ఇచ్చారు.

త్వరలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, కేంద్రన మంత్రి కిషన్ రెడ్డి, వీవేక్‌తో చర్చలు జరిపారు. మరో మూడు రోజుల్లోనే వీరంతా ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడ బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయ కండువాను కప్పుకోనున్నారు రాజగోపాల్ రెడ్డి.

ఐతే ఆయనతో పాటు ఇంకా ఎవరెవరు బీజేపీలో చేరతారన్నది కూడా హాట్ టాపిక్‌గా ఉంది. తనతో పాటు ఇద్దరు కాంగ్రెస్ ముఖ్యనేతలను బీజేపీలోకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.

మ‌రోవైపు కోమటిరెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ సీరియస్‌గా ఉంది. ముడుగోడు నియోజకవర్గంపై ఫోకస్‌పెట్టిన కాంగ్రెస్‌.. ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డి బీజేపీ వైపు మొగ్గు చూపడం చర్చనీయాంశంగా మారింది. పలువురు కాంగ్రెస్‌ పెద్దలు రాజగోపాల్‌రెడ్డిలో చర్చలు జరిపినా ఫలించలేనట్లు తెలుస్తోంది.

Related posts