telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వరదల విషయంలో దయచేసి రాజకీయాలు వద్దు..

kishanreddy on ap capital

తెలంగాణలో వరదలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. వరదల వల్ల ఇల్లు కూలిపోయాయి.. కొందరు మరణించారు.. పేద వారి ఇళ్లలో నిత్యావసర వస్తువులు పాడై పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ..ఏపీ, తెలంగాణ సీఎం లతో మాట్లాడారు..అమిత్ షా కూడా మాతో, అధికార యంత్రాంగంతో టచ్ లో ఉన్నాడని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా ఉంటామని పీఎం మోడీ తెలిపారన్నారు. తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని ఫైర్ అయ్యారు. ప్రతి సమ్మర్ లో నాలల్లో సిల్ట్ తీసే సంప్రదాయం ఉండేదని..కాంట్రాక్టర్లు తూతూ మంత్రంగా పై పై పూడిక తీస్తున్నారని మండిపడ్డారు. Ghmc మాన్ హోల్ సిల్ట్ సరిగా తీయదని..దాని పర్యవసానమే ఇప్పటి పరిస్థితి అని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం మౌలిక వసతుల పై దృష్టి పెట్టాల్సి ఉందని..వర్షపు నీటి కాలువలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. వరదల విషయంలో దయచేసి రాజకీయాలు వద్దని పేర్కొన్నారు.

గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం వ్యవస్థ దెబ్బతిందన్నారు. వర్ష ప్రభావంతో ఇబ్బంది పడుతున్న వారికి సహాయం అందించాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారని పేర్కొన్నారు. నష్ట పోయిన వారికి బియ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని…అది సంతోషకరమన్నారు. కరోన ప్రబలే ప్రమాదం ఉంది.. బస్తి ప్రజలు మాస్క్ లు ధరించడం లేదు.. ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు సహాయం కోరుకుంటున్నారు.. రాజకీయాలు కోరుకోవడం లేదు..రెండు మూడు రోజులు రాజకీయాలు చేయకుండా సహాయ కార్యక్రమాలు చేయాలన్నారు. స్థానిక పార్లమెంట్ సభ్యుడు గా నేను నియోజకవర్గంలో తిరిగానని..అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరనని పేర్కొన్నారు. నష్టం పై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపించాక కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

Related posts