telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

కేవలం రూ. 1కే నల్లా కనెక్షన్ .. జలమండలి అధికారులు

municipal water tap is just for 1 rupee

నల్లా కనెక్షన్ పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నీటివృధా మరియు రోడ్ల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నల్లా కనెక్షన్ ధర భారీగా తగ్గించేశారు. బస్తీలు, మురికి వాడల్లో తాగునీటి వసతి కల్పించేందకు జలమండలి అధికారులు నల్లా కనెక్షన్ ఇవ్వడం కోసం చర్యలు తీసుకుంటున్నారు. మురికివాడల ప్రాంతాలతో పాటు మరికొన్ని బస్తీలలో నీటికనెక్షన్లు లేకపోవడం వల్ల బస్తీలలో ఉన్న పబ్లిక్ నల్లాలపై ప్రజలు ఆధారపడుతున్నారు. గతంలో ప్రతీ బస్తీలో పబ్లిక్ నల్లాలు ఉండేవి. బస్తీలు అభివృద్ధి చెంది ఎవరికివారు ఇంటింటికీ నల్లా కనెక్షన్‌లు తీసుకున్నారు. దీనితో పబ్లిక్ నల్లాలకు ఆదరణ తగ్గింది.

సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే జలమండలి సెక్షన్‌ల పరిధిలో స్వల్ప సంఖ్యలోనే పబ్లిక్ నల్లాలు కొనసాగుతున్నాయి. కొన్ని బస్తీలలో ఇప్పటికి పబ్లిక్ నల్లాలు కొనసాగుతుండడంతో వాటికి దగ్గరగా ఉన్నవారు నల్లా కనెక్షన్ తీసుకోడానికి ఉత్సాహం చూపడం లేదు. ఇంటిస్థలాన్ని బట్టి జలమండలికి చెల్లించాల్సిన డిపాజిట్‌లకు బయపడి కనెక్షన్ తీసుకోకుండా పబ్లిక్ నల్లాలపై ఆధారపడుతున్నారు. ఇప్పటికే చాలాచోట్ల కనెక్షన్‌లను తొలిగించినప్పటికి ప్రజల ఒత్తిడి మేరకు కొన్ని కనెక్షన్‌లను కొనసాగిస్తున్నారు.

పబ్లిక్ నల్లా ల ద్వారా నీటిని పట్టుకున్న అనంతరం వాటిని బంద్ చేయడానికి అవకాశం లేకపోవడంతో నీటిని రోడ్లపైకి వదులుతున్నారు. బిరడాలు లేనికారణంగా నీటి సరఫరా జరుగుతున్నంత సమయం విలువైన నీరు వృథా పోతుంది. ఒకవైపు ఎంతో విలువైన నీరు వృథా కావడమే కాకుండా, లక్షల రూపాయల వెచ్చించి వేసిన రోడ్లు కూడాపాడైపోతున్నాయి. కొన్ని నివాసాలలో కూడా నల్లాలకు బిరడాలు పెట్టకపోవడం వల్ల కూడా తాగునీరు వృథా అవుతోంది. రోడ్లపై పారుకుంటూ దారిన పోయే వాహనదారులకు కూడా తిప్పలు తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితిని నివారించడం కోసం జలమండలి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

మురికివాడల ప్రాంతాలలో, వెనుకబడిన బస్తీలలో నల్లా కనెక్షన్ పొండడం కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సివస్తుందని భావించి నల్లా కనెక్షన్ తీసుకోని వారికి కేవలం రూ. 1కే నల్లా కనెక్షన్ ఇస్తామని జలమండలి అధికారులు చెబుతున్నారు. అర్హులైన వారందరి నీటి వసతిని కల్పించే లక్ష్యంతోనే కాకుండా తాగునీటి వృథాను అరికట్టడం కోసం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పది రోజుల కిందట జీహెచ్‌ఎంసీ కమిషనర్, జలమండలి ఎండీ దానకిశోర్ సీతాఫల్‌మండిలో తాగునీటి వినియోగదారులకు రూ. 1కే కనెక్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఈమేరకు జలమండలి అధికారులు సిద్ధ్దమవుతున్నారు. ఏదిఏమైనా తాగునీటి వృథాను నివారించడమే కాకుండా రోడ్లను కాపాడే లక్ష్యంతో అధికారులు చర్యలు చేపట్టారు.

Related posts