హైకోర్టు జగన్ అక్రమాస్తుల కేసులో తాజా ఆదేశాలిచ్చింది. కేసుల విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసిన ఆస్తులను రిలీజ్ చేయటం పైన ఈడీ హైకోర్టులో అప్పీల్ చేసింది. దీని పైన హై కోర్టు స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్త్వులు జారీ చేసింది. దీని పైన వివరణ ఇవ్వాలంటూ ప్రతివాదులుగా ఉన్న మూడు సంస్థలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అప్పిలేట్ ట్రైబ్యునల్ ఆదేశాలపై ఈడీ హైకోర్టును ఆశ్రయించగా ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. పెన్నా సిమెంట్స్, ఎంబసీ ప్రాపర్టీ డెవల్‌పమెంట్ సంస్థ, పయనీర్ హాలిడే రిసార్ట్స్ ఆస్తులను ఈడీ అప్పిలేట్ ట్రైబ్యునల్ రిలీజ్ చేయడాన్ని హైకోర్టులో ఈడీ అప్పీలు చేసింది. ఈ అప్పీలు పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం… యథాతథ స్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. వివరణ ఇవ్వాలంటూ ఈ వ్యాజ్యాల్లో ప్రతివాదులుగా ఉన్న మూడు సంస్థలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా అనంతపురం జిల్లా యాడికి మండలంలోని నిట్టూరు, కుందన్‌కోట, గుడిపాడు, కమలపాడు గ్రామాల్లోని పెన్నా సిమెంట్స్ సంస్థకు చెందిన సుమారు 231.09 ఎకరాలను ఈడీ అటాచ్ చేస్తూ 2015 ఆగస్టులో ఆదేశాలు ఇచ్చింది. పెన్నా గ్రూపునకు చెందిన పయనీర్ హాలిడే రిసార్ట్స్ సంస్థ హైదరాబాద్‌లోని హోటళ్లకు చెందిన సుమారు 1700 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని ఈడీ 2015 డిసెంబరులో అటాచ్ చేసింది. ఈడీ ఆదేశాలపై పెన్నా సిమెంట్స్, పయనీర్ హాలిడే రిసార్ట్స్ సంస్థలు అప్పిలేట్ ట్రైబ్యునల్‌లో అప్పీలు చేశాయి. వీటిని విచారించిన ట్రైబ్యునల్… పెన్నా సిమెంట్స్ భూముల తాత్కాలిక జప్తు ఆదేశాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈడీ ఆ భూములను తన అధీనంలోకి తీసుకోరాదని ఆదేశించింది.
ఎంబసీ ప్రాపర్టీ డెవల్‌పమెంట్స్ సంస్థ ఏపీహెచ్‌బీతో కలిసి హైదరాబాద్, కర్నూలు జిల్లా నంద్యాలలో చేపట్టిన గృహనిర్మాణాలను, ఎంబసీ ప్రాపర్టీస్ సంస్థ ఎండీ జితేంద్ర డిపాజిట్లను ఈడీ 2018 జనవరి 3న ఆదేశాలు జారీచేసింది. ఈడీ ఉత్తర్వులపై ఎంబసీ సంస్థ న్యాయ నిర్ణయాధికార సంస్థ(అడ్జుడికేటింగ్ అథారిటీ)ని ఆశ్రయించింది.దీనిని విచారించిన అథారిటీ… ఎంబసీ ప్రాపర్టీ్‌సకు చెందిన రూ.25.50 లక్షల డిపాజిట్లను జప్తుచేయడం సరికాదని వ్యాఖ్యానించింది. ఈ సంస్థకు చెందిన చరాస్తులకు, నేరాభియోగాలకు సంబంధం లేదని 2018 జూన్ 26న ఆదేశించింది. దీనిపై ఈడీ అట్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. అప్పిలేట్ ట్రిబ్యునల్.. అడ్జుడికేటింగ్ అథారిటీ ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. దీంతో అప్పిలేట్ ట్రైబ్యునల్ ఆదేశాలపై ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిని విచారించిన హైకోర్టు… ఫిక్స్‌డ్ డిపాజిట్లపై స్టేట్‌సకో ఆదేశాలు పాటించాలని ఆదేశించింది.