telugu navyamedia
తెలంగాణ వార్తలు

బాలాపూర్ లడ్డు వేలం పాట.. ప్రత్యేకత

గణేష్ ఉత్సవాల్లో ఇప్పుడు అందరి దృష్టి బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాట పై పడింది. గత ఏడాది కరోనా కారణం గా లడ్డు వేలం కు బ్రేక్ పడింది. గత ఏడాది బాలాపూర్ లడ్డు ను ముఖ్యమంత్రి KCR కు అందించిన ఉత్సవ కమిటీ. అయితే 2019 లో 17 లక్షల 60 వేల రూపాయలు పలికింది. ఈ సంవత్సరం ఎంత ధర పలుకుతుoదో అని భక్తుల లో ఒక్కటే  ఉత్కంఠ. అయితే లడ్డు వేలానికి ఆజ్యుడు బాలాపూర్ గణేషుడు. బాలాపూర్ గణేష్ లడ్డును వేలం పాటలో సొంతం చేసుకునేoదుకు భక్తులు పోటి పడుతుంటారు. లడ్డు తీసుకుంటే.. అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం.

1994 వరకు బాలాపూర్ అంటే… ప్రజలకు పెద్దగా తెలిసేది కాదు. 1994 నుంచి లడ్డు వేలం తో యావత్తు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది బాలపూర్. ప్రపంచం లో మొదటి సారిగా గణేష్ చేతిలో పెట్టిన లడ్డు ప్రసాదం వేలం  వేయడం బాలాపూర్ నుంచే ప్రారంభమైంది. 1994 లో 450 రూపాయలకు బాలాపూర్ లడ్డు సొంతం చేసుకున్నారు కొలను మోహన్ రెడ్డి.

2019 లో కొలను రాంరెడ్డి 17 లక్షల 60 వేల రూపాయలకు బాలాపూర్ లడ్డు ను సో0తం చేసుకున్నారు. బాలాపూర్ లడ్డు బరువు కేవలం 21 కేజీ మాత్రమే. ప్రసాదం పరిమాణం చిన్నదే అయినా.. ఆ లడ్డు సొంతం చేసుకొంటే గణపతి కటాక్షం దక్కుతుందని సెంటిమెంట్ గా భావిస్తారు భక్తులు.

అందుకే ఈ లడ్డు కోసం ఎన్ని లక్షలు పెట్టడానికైనా వెనకాడరు భక్తులు. బాలాపూర్ గణేష్ లడ్డు వేలం ద్వార  వచ్చిన డబ్బులతో దేవాలయాల అభివృద్ధి , గ్రామాభివృద్ది కి  , పలు స్వచ్చంద కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్నారు. బాలాపూర్ గణేషుడు ఎత్తు లేకున్నా… లడ్డు వేలం లో అందరి దృష్టి ఆకర్శిస్తూ వినాయక చవితి ఉత్సవాలకే  ప్రత్యేకంగా నిలుస్తూన్నాడు.

 

Related posts