telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీలో ప్ర‌జ‌ల‌కు గుడ్‌న్యూస్ : రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత.

ఏపీలో నైట్‌ కర్ఫ్యూ ఎత్తివేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నైట్ కర్ఫ్యూ ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ కరోనా ఆంక్షలు కొనసాగించాలని నిర్ణయించింది. మాస్క్‌లు కచ్చితంగా పెట్టుకునేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి అధ్యక్షతన క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం సమీక్షలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

షాపుల్లో, మాల్స్‌లో కచ్చితంగా కరోనా జాగ్రత్తలు పాటించాలని ఆదేశించింది. ఫీవర్‌ సర్వే కొనసాగించాలని సీఎం జగన్ సూచించారు. లక్షణాలు ఉన్నవారికి టెస్టుల ప్రక్రియ కొనసాగించాలన్నారు.

ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీఎం కోరారు.సిబ్బంది తప్పనిసరిగా ఆస్పత్రుల్లో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

ఆస్పత్రుల్లో పరిపాలనా బాధ్యతలను, చికిత్స బాధ్యతలను డివైడ్ చేయాలని సీఎం ఆదేశించారు. పరిపాలనా బాధ్యతలను అందులో నిపుణులైన వారికి అప్పగించాలని సూచించారు.గిరిజన ప్రాంతాల్లో పనిచేసే స్పెషలిస్టు వైద్యులకు, వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో నైట్ కర్ఫ్యూను ఎత్తివేశారు. దాదాపు నెల రోజుల నుంచి నైట్ కర్ఫ్యూ ఆంధ్రప్రదేశ్ లో కొనసాగింది.

Related posts