లాక్ డౌన్ ముగిసిన తర్వాత ఏపీలో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారని విద్యా శాఖ మంత్రి సురేశ్ తెలిపారు. లాక్ డౌన్ ముగిసిన రెండు వారాల తర్వాత పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేస్తామని తెలిపారు.
సామాజిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని, నూతన విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ తయారు చేస్తామని చెప్పారు. కాగా, రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సురేశ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యేల జీతాలపైన టాక్స్ ఉండదు.. కానీ ఆర్టీసీపైన టాక్స్ ఎందుకు?