ప్రస్తుతం మన దేశం మొత్తం కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు గురించి మాట్లాడుకుంటుంది. అయితే ఈ నెల 21 వ తేదీన ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ మందుపై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో నివేదికలు అందిన తరువాత, పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే, ఈ మందులో ముఖ్యంగా వినియోగించే డామరడంగి, నేల ఉసిరి, పిప్పింటాకు జాతి మొక్కలు సంవత్సరంలో మూడు నెలలు మాత్రమే బతికి ఉంటాయి. అయితే ఈ మొక్కలు ఈ ఏడాది మరో నెల రోజులు మాత్రమే అదుబాటులో ఉంటాయి. కాబట్టి ఆ తరువాత ఈ మందు తయారి అందుబాటులో ఉండకపోవచ్చు అనే అనుమానాలు వస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
previous post
next post