దేశంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఇద్దరూ బలమైన నేతలేననీ ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. బెంగాల్‌లో శనివారం మమత నిర్వహించిన ర్యాలీకి అఖిలేష్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో మాయావతి, మమత బెనర్జీ ఇద్దరూ బలమైన నేతలేననీ, మహాకూటమిని నడిపించగల శక్తి వారిలో ఉందని అన్నారు.
దేశంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో దేశానికి కొత్త ప్రధాని కావాలని, సరికొత్త నాయకత్వానికి తమ కూటమి నాందిపలుకుతుందని అఖిలేష్ పేర్కొన్నారు. ప్రస్తుతం తమ ముందన్న లక్ష్యం బీజేపీని ఓడించడమేనని వ్యాఖ్యానించారు. దేశ ప్రధానిగా మాయావతి లేదా మమతా బెనర్జీ అయితే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.