telugu navyamedia
రాజకీయ వార్తలు

బీజేపీ నేతలను ప్రచారం నుండి .. ఈసీ నిషేధం..

EC prohibited bjp leaders campaign

ఈసీ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, భాజపా ఎంపీ పర్వేశ్‌ సాహిబ్‌ సింగ్ వర్మలపై నిషేధం విధించింది. కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ రానున్న 72 గంటలపాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించింది. ఇక మరో ఎంపీ పర్వేశ్‌ వర్మపై 96 గంటలపాటు నిషేధం విధించింది. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ బహిరంగసభలో అనురాగ్ ఠాకూర్‌ మాట్లాడుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సీఏఏకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారిని, ప్రతిపక్షాలను దేశద్రోహులుగా ఆరోపించారు. వారిపై తూటాలు పేల్చండి అంటూ వివాదాస్పదంగా మాట్లాడారు.

ఠాకూర్ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ కాంగ్రెస్‌ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. దీంతో ఈసీ ఆయనపై చర్యలు తీసుకుంటూ అనురాగ్‌ ఠాకూర్‌ ప్రచారంపై నిషేధం విధించింది. ఇక మరో ఎంపీ పర్వేశ్‌ వర్మ కూడా ఓ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ షహీన్‌బాగ్ ఆందోళనకారులపై వివాస్పద వ్యాఖ్యలు చేశారు. ”షహీన్‌బాగ్‌ ఆందోళకారులు ఇళ్లలోకి చొరబడి ఆత్యాచారాలు, హత్యలు చేస్తారు” అని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఈసీ ఆయనపై కూడా నిషేధం విధించింది.

Related posts