telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

తెలంగాణ కాంగ్రెస్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాలి: సర్వే 

Sarve Satyanarayana Money Seized 
తెలంగాణ కాంగ్రెస్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాలనీ  కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కూమార్‌ రెడ్డి అసమర్థుడని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణమైన ఆయన వెంటనే రాజీనామా చేయాలని సర్వే డిమాండ్‌ చేశారు. ఉత్తమ్‌ నాయకత్వాన్ని నమ్ముకుంటే లోక్‌సభ ఎన్నికల్లో గెలవడం చాలా కష్టమని అన్నారు. ఉత్తమ్‌ను తప్పిస్తేనే కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో బతుకుతుందని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేతగా మల్లు భట్టి విక్రమార్కను నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు. భట్టికి సీఎల్పీ పదవి ఇవ్వడం మంచి నిర్ణయమని, బలహీన వర్గాలకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని మరోసారి రుజువైందని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించి ఉంటే దళితుడు సీఎం అయ్యేవాడని అభిప్రాయపడ్డారు.

Related posts