telugu navyamedia
సినిమా వార్తలు

ఎన్టీఆర్ మామపై నారా రోహిత్ ఫైర్

Nara-Rohith

వైసిపి నేత, జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు చేసిన ఆరోపణలపై నటుడు నారా రోహిత్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన తమ్ముడు రామమూర్తి నాయుడును పట్టించుకోకుండా, దూరం పెట్టారంటూ శ్రీనివాసరావు ఆరోపించడంపై నారా రోహిత్ స్పందించాడు. మీ రాజకీయ ప్రయోజనాల కోసం మధ్య విబేధాలు సృష్టించకండి. రామలక్ష్మణుల్లా ఉండే మా పెదనాన్న, నాన్నల మధ్య విబేధాలు ఉన్నాయని చెప్పడం బాధాకరం, ఆంధ్రప్రదేశ్ ప్రజలను మా పెదనాన్న ఎలా చూసుకుంటున్నారో మమ్మల్ని కూడా అలాగే చూసుకుంటున్నారు అంటూ వివరించారు. నారా వంశం పేరును నిలబెట్టడానికి తమ కుటుంబం నుంచి ఒక్కరు చాలని, ఆ కారణంగానే కియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నామని, తన తండ్రి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇంటికే పరిమితమయ్యారని నారా రోహిత్. రాజకీయంగా చంద్రబాబు నాయుడును ఎదుర్కోలేకనే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు నారా రోహిత్.

Related posts