telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సరికొత్తగా “వరల్డ్ ఫేమస్ లవర్” ప్రమోషన్ షురూ

WFL

“పెళ్లి చూపులు” సినిమాతో తొలి విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ ఆ త‌ర్వాత “అర్జున్ రెడ్డి”తో ఫేట్‌నే మార్చుకున్నాడు. దేశవ్యాప్తంగా ఆయ‌న‌కి ఆద‌ర‌ణ ల‌భించింది. ఈ సినిమా త‌ర్వాత “గీత గోవిందం”, “ట్యాక్సీవాలా” చిత్రాలు విజ‌య్‌కి మంచి విజ‌యం అందించాయి. ప్ర‌స్తుతం హీరో అనే సినిమా చేస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ తన తొమ్మిద‌వ సినిమాగా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కేఎస్‌ రామారావు నిర్మాణంలో సినిమా చేస్తున్నాడు . ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ డైరెక్టర్ క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు “వరల్డ్ ఫేమస్ లవర్” అనే టైటిల్‌ ను ప్ర‌క‌టించారు. ఈ సినిమాలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజబెల్లా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి వేలంటెన్స్ డే సంద‌ర్భంగా ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల చేస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా.. నాలుగు రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించి 4 ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డానికి యూనిట్ ప్లాన్ చేస్తుంది.

Related posts