telugu navyamedia
సినిమా వార్తలు

జూలై 12న “సూప‌ర్ 30″… కంగనాకు ట్విస్ట్ ఇచ్చిన హృతిక్

Hrithik-Roshan

గతంలో హృతిక్ రోష‌న్‌, కంగ‌నా రనౌత్ మ‌ధ్య మొద‌లైన గొడ‌వ ఇప్పటికీ రాజుతూనే ఉంది. వీలున్న‌ప్పుడ‌ల్లా సోషల్ మీడియా వేదిక‌గా కంగ‌నా, హృతిక్‌ను టార్గెట్ చేస్తూనే ఉంది. ఇక హృతిక్ హీరోగా గ‌ణిత మేధావి ఆనంద్ కుమార్ బ‌యోపిక్‌ను “సూప‌ర్ 30” పేరుతో తెర‌కెక్కిస్తున్నారు. హృతిక్ ఇందులో టైటిల్ పాత్ర‌లో న‌టించారు. ముందుగా ఈ సినిమాను జూలై 26న విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే అదే రోజున కంగ‌నా త‌న చిత్రం “మెంట‌ల్ హై క్యా” చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్ర‌క‌టించింది. కంగ‌నా కావాల‌నే ఇలా చేస్తుంద‌ని హృతిక్ అభిమానులు అన్నందుకు కంగ‌నా సోద‌రి రంగోలి… సోష‌ల్ మీడియాలో హృతిక్‌పై విరుచుకుప‌డింది. దీంతో హృతిక్ త‌న సినిమాను వాయిదా వేసుకోవాల‌నుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 25న త‌న సినిమాను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు.

అయితే ఇప్పుడు అకస్మాత్తుగా హృతిక్ తన “సూప‌ర్ 30” సినిమాను జూలై 12న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. ఈద్ సంద‌ర్భంగా జూన్ 4న ట్రైల‌ర్‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వాయిదా వేసుకున్న‌ట్లే వేసుకుని రెండు వారాల ముందుగానే త‌న సినిమాను హృతిక్ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డం అనేది కంగ‌నాకు ఝలక్ ఇవ్వడమేనని అంటున్నాయి సినీ వర్గాలు.

Related posts