telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హృతిక్ రోష‌న్‌, టైగ‌ర్ ష్రాఫ్ ల “వార్” అదిరింది

War

బాలీవుడ్ స్టార్ హీరోలు హృతిక్ రోష‌న్‌, టైగ‌ర్ ష్రాఫ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం “వార్”. “వార్” చిత్రంలో వాణీ క‌పూర్ న‌టిస్తున్న‌ది. సిద్ధార్డ్ ఆనంద్ దీన్ని డైర‌క్ట్ చేస్తున్నారు. య‌స్‌రాజ్ ఫిల్మ్స్‌ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ చిత్రం టీజ‌ర్‌ను ఈరోజు విడుదల చేశారు. ఈ టీజర్లో బైక్‌లు, హెలికాప్ట‌ర్లు, కార్లతో చేజింగ్ సీన్లు థ్రిల్ పుట్టిస్తున్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్ అత్య‌ద్భుత ఫైటింగ్ స‌న్నివేశాల‌తో “వార్” సినిమా టీజర్ యాక్షన్ ప్రియులను థ్రిల్ కు గురి చేస్తోంది. యాక్ష‌న్ హీరోలు ఇద్ద‌రూ త‌మ స్టంట్ స్కిల్స్‌తో దుమ్మురేపారు. టీజ‌ర్‌ విడుదలైన సంద‌ర్భంగా స్టార్స్ ఇద్ద‌రూ ట్విట్ట‌ర్‌లో ఒక‌రిపై ఒక‌రు కామెంట్లు చేసుకున్నారు. “హృతిక్ నీ స్టంట్స్ కొంచెం స్లోగా ఉన్నాయి, అవి ఎలా చేయాలో నేను చూపిస్తా” అంటూ టైగ‌ర్ ష్రాఫ్ ట్వీట్ చేశారు. “నేను ఏలిన రాజ్యంలో నువ్వు ఇప్పుడే అడుగుపెట్టావ్ టైగ‌ర్” అంటూ హృతిక్ ఓ ట్వీట్‌తో స‌మాధానం ఇచ్చాడు.

Related posts