telugu navyamedia
సినిమా వార్తలు

శంకర్ సినిమాలో విలన్ గా బాలీవుడ్ బాద్షా

Shah-Rukh-Khan

ప్రముఖ దర్శకుడు శంక‌ర్, లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ హీరోగా తెర‌కెక్కిన చిత్రం “భార‌తీయుడు”. అప్పట్లో ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా “ఇండియ‌న్-2” టైటిల్ తో సినిమాను రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమా సెట్స్‌పై ఉండ‌గానే, ఆయ‌న తదుప‌రి ప్రాజెక్ట్‌కి సంబంధించిన వార్త ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. “ఇండియ‌న్-2” త‌ర్వాత బాలీవుడ్ యాక్ష‌న్ హీరో హృతిక్ రోష‌న్‌తో క‌లిసి శంక‌ర్ సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో చిత్రం చేయ‌నున్నాడ‌ని చెప్పుకొచ్చారు. కాని తాజా స‌మాచారం ప్ర‌కారం హృతిక్ రోష‌న్ స్థానంలో షారూఖ్ ఖాన్ వ‌చ్చి చేరిన‌ట్టు తెలుస్తుంది. “జీరో” చిత్రం త‌ర్వాత మ‌రో సినిమాని ఓకే చేయ‌ని షారూఖ్‌.. శంకర్ తెర‌కెక్కించ‌నున్న చిత్రంలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర పోషించ‌నున్నాడ‌ట‌. సూపర్ పవర్స్ కలిగి ఉన్న ఒక గొప్ప తెలివిగల ఆక్టోపస్ లాంటి జీవి అయిన చీఫ్ విరోధి పాత్ర పోషించడానికి షారూఖ్ సిద్దంగా ఉన్నాడ‌ట‌. ఇప్ప‌టికే శంక‌ర్.. షారూఖ్‌ని సంప్ర‌దించి పాత్ర గురించి చెప్ప‌డంతో ఆయ‌న ఈ ప్రాజెక్ట్‌లో న‌టించేందుకు సిద్ద‌మ‌య్యాడ‌ని చెబుతున్నారు. మ‌రి ఈ వార్తలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Related posts