నా ఊహా సుందరీ!
నా కలల రాకుమారీ!!
నా ప్రాణేశ్వరీ! మల్లీశ్వరీ!!
ప్రేమాకాశంలో
జంట పక్షులై విహరిద్దాం
ప్రేమకు ప్రతిబింబాలై
భానుని సాక్షిగా.
తరువుల తోడుగా!
వలపుల వాగునీటిలో
ప్రేమ తలపులు అలపై
కనిపిద్దాం!పయనిద్దాం!!
ప్రేమదేశంలో…
స్వేచ్చావిహగంగాలై
ప్రణయ గీతాలు పాడుకుంటూ!
ప్రేమగూటికి చేరుకుందాం
వలపు దుప్పట్లో దూరుకుందాం
-గద్వాలసోమన్న, ఎమ్మిగనూరు