telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. ప్రకాశంలో పేపర్ మిల్..

కొత్త రాష్ట్రంలో రాజధాని సొగసులు దిద్దుకుంటూ ఒకపక్క రూపొందుతుంటే, మరోపక్క అదే తరహాలో అభివృద్ధికి చిహ్నంగా అనేక పరిశ్రమలు కూడా రావటం జరుగుతుంది. ఇదే తరహాలో తాజాగా, ఆంధ్రప్రదేశ్‌ లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటు అవుతుంది.

prakasham paper mill opening

రామాయపట్నం సమీపంలో ఆంధ్రా పేపర్ ఎక్స్‌లెన్స్ (ఏపీఈ) పేరుతో ఇండోనేషియాకు చెందిన ఆసియా పల్ప్ అండ్ పేపర్ మిల్స్ (ఏపీపీ) ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. రెండు దశల్లో మొత్తం రూ. 24 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్న ఈ కంపెనీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు శంకుస్థాపన చేయనున్నారు.

మన దేశానికి ఇప్పటి వరకు వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో (ఎఫ్‌డీఐ) ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఈ పరిశ్రమ ద్వారా 15 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లోని 60 వేల మంది సుబాబుల్, యూకలిప్టస్ సాగు రైతులకు ప్రయోజనం కలుగుతుంది. కాగా, నేడు రామాయపట్నం పోర్టుకు కూడా చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పోర్టు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

Related posts