telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్ లో ఉన్న వారిని బెదిరిస్తున్నారు: చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరోసారి విరుచుకుపడ్డారు. మనం అభివృద్ధి చెందితే తెలంగాణ ఎత్తిపోతుందని కేసీఆర్ భయమని విమర్శించారు. అందుకే మనల్ని దెబ్బతీసి, అభివృద్ధి చెందకుండా చూసి రాజకీయం చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లో ఉన్న వారిని బెదిరిస్తున్నారని విమర్శించారు.

హైదరాబాద్ లో ఆస్తులున్నవారికి నోటీసులు ఇస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ జోలికొస్తే ఖబడ్దార్..జాగ్రత్త’ అని హెచ్చరించారు. మన ఓటుతో జగన్, కేసీఆర్, మోదీ బుద్ధి చెప్పాలని బాబు ప్రజలకు పిలుపు నిచ్చారు. ‘ వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, చిన్న శ్రీనులు రెచ్చిపోతున్నారని, ఫోక్స్ వ్యాగన్ ఫ్యాక్టరీని తాను తీసుకొస్తే, బొత్స అవినీతి కారణంగా ఆ కంపెనీ వెళ్లిపోయిందని విమర్శించారు. తెలంగాణలో ఏమీ పని చేయని కేసీఆర్ కు 88 సీట్లు వస్తే, తాను రోజుకు 18 గంటలు పనిచేస్తున్నానని, తమ పార్టీకి 150 సీట్లు రావాలని అన్నారు.

Related posts