telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో సహకార సంఘాల ఎన్నికలు

KCR cm telangana

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. నాలుగు రోజుల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేలా నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు. 15 రోజుల్లో మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.

సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, ఎన్నికలు వెంటనే జరిపించాలని సూచించారు. ఇన్ చార్జ్ ల పదవీకాలం ముగిసేలోగానే షెడ్యూల్ ను ప్రకటించాలని అన్నారు. దీంతో అధికారులు సహకార సంఘాల ఎన్నికల కసరత్తు ప్రారంభించారు.

Related posts