telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

రెట్టింపైన కనీస వేతనం.. కేంద్ర నిర్ణయం .. !

minimum salaries are doubled by central govt

తాజా కేంద్ర నిర్ణయంతో, దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల కనీస వేతనం రెట్టింపు కానుంది. ప్రస్తుతం రోజుకి సగటు కనీస వేతనం రూ.176 ఉండగా ఇది గరిష్ఠంగా రూ.447 వరకు పెరగనుంది. జాతీయస్థాయిలో కనీస వేతనాల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఈ మేరకు సిఫార్సు చేసింది. రాష్ట్రాలను 5 కేటగిరీలుగా విభజిస్తూ ఆ మేరకు కనీస వేతనాలను కమిటీ ప్రతిపాదించింది. తెలుగు రాష్ట్రాలను ఒకే కేటగిరీ కిందకు తీసుకొస్తూ నెలవారీ కనీస వేతనాన్ని రూ.9,880గా పేర్కొంది. 2018 జులై నాటికి ధరల ప్రామాణికంగా ఒక్కో వ్యక్తికి అయ్యే ఖర్చును లెక్కించి నివేదిక సిద్ధం చేసిన కమిటీ.. దాన్ని కేంద్ర కార్మికశాఖకు అందించింది.

ఇప్పటివరకు మూడు రీజియన్లగా కనీస వేతనాలు విభజించేవారు, కానీ తాజాగా ఇది 5కు పెరగటం విశేషం. ఇందులో తెలుగు రాష్ట్రాలు రీజియన్‌-2లో ఉన్నాయి. ఈ ప్రాంత కార్మికులకు కనీస వేతనం తక్కువగా ఉంటోంది. దిల్లీ, గోవా, హరియాణా, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ను కేటగిరీ-4లో చేర్చారు. కనీస వేతనానికి అదనంగా రోజుకి రూ.55 చొప్పున ఇంటి అద్దెను పేర్కొంది. ఈ లెక్కన ప్రాంతాల వారీగా ధరలు ఉండనున్నాయి. రీజియన్‌-2: కనీసవేతనం: రోజుకి రూ.380, నెలకు రూ.9,880 ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, జమ్ముకశ్మీర్‌, ఉత్తరాఖండ్‌

Related posts