దేశంలో కరోనా కేసులు 20 వేల దిగువకు చేరాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 19,740 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక ప్రస్తుతం దేశంలో 2,36,643 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 248 మంది మృతి చెందారు.
దేశంలో ఇప్పటి వరకు మొత్తం 4,50, 375 మంది కరోనాతో మృతి చెందారు. ఒక్క రోజులో దేశంలో 23, 070 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 93.99 కోట్ల మందికి కరోనా టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఆడ్రస్ లేవు: ఎమ్మెల్యే సీతక్క