telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్‌ ను భుజం తట్టి అభినందించిన మోదీ

modi positive responce on jagan meet about AP

ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో నరేంద్ర మోదీతో భేటీ అయిన విషయం తెలిసిందే. భేటీ సందర్భంగా జగన్‌ను ఆలింగనం చేసుకుని భుజం తట్టి మోదీ అభినందించారు. గంటకు పైగా వివిధ అంశాలపై మోదీతో జగన్ చర్చించారు. ముఖ్యంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని మోదీని జగన్‌ కోరారు. పోలవరం ప్రాజెక్ట్‌ను వేగంగా పూర్తి చేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే ఏపీకి రావాల్సిన పెండింగ్‌ నిధులపై ప్రధానితో చర్చించారు. రాష్ట్రాభివృద్ధికి పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలోని అన్ని హామీలను అమలు చేయాలని ప్రధానికి జగన్‌ విజ్ఞప్తి చేశారు.ఇద్దరూ సుమారు గంటకు పైగా పలు కీలక విషయాలపై నిశితంగా చర్చించారు. రాష్ట్ర సమస్యలే ప్రధాన ఎజెండాగా ప్రధానితో భేటీ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని సమస్యలను మోదీ దృష్టికి తీసుకెళ్లారు. మీ హయాంలో మేం చేయగలిగినంత మేర సహాయం చేస్తాం. ఏపీని అన్నివిధాలుగా అభివృద్ధి చేయడంలో తోడ్పాటునందిస్తామని మోదీ హామీ ఇచ్చారు.

Related posts