telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

చలానా లేకుండా మంచి ఆలోచన.. బెడిసికొట్టిందా..

car number plate with cm name

ఇటీవల చలానా అంటే బెంబేలెత్తిపోతున్నారు ప్రయాణికులు. ఎందుకో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొత్త మోటారు చట్టం పుణ్యమా అని చలానా పేరుతో వేలకువేలు కట్టాల్సి వస్తుంది. దీనితో కొత్తకొత్త ఆలోచనలు కూడా తెరపైకి వస్తున్నాయి. అందులో ఒకటి.. నగరంలోని జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు కారు నంబర్ ప్లేటుపై నంబర్ బదులు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరును రాసుకొని తిరుగుతున్న యువకుడిపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల ప్రాంతంలో ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో జీడిమెట్ల పైప్ లైన్ రోడ్డులో తనిఖీలు జరిగాయి. తనిఖీలు నిర్వహించే సమయంలో ట్రాఫిక్ సిబ్బంది అటుగా వచ్చిన ఒక కారును చూసి షాక్ ఆయ్యారు. ఆ కారు నంబర్ ప్లేటు మీద ‘AP CM jagan’ అని ఉంది. పోలీసులు కారు యజమని ముప్పిడి రవి రాకేష్ ను ఎందుకు సీఎం జగన్ పేరు నంబర్ ప్లేటుపై రాసుకున్నావని ప్రశ్నించారు.

ముప్పిడి రవి రాకేష్ టోల్ రుసుం, పోలీసుల తనిఖీల మినహాయింపు కొరకు ఈ విధంగా చేశానని పోలీసులకు చెప్పాడు. ఆ తరువాత ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ కారును సీజ్ చేసి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలుస్తోంది. పోలీసులు కారు యజమాని ముప్పిడి రవి రాకేష్ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం అని గుర్తించారు. సదరు యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలుస్తోంది. పోలీసుల విచారణలో ముప్పిడి రవి రాకేష్ హైదరాబాద్ నగరంలోని ఒక కళాశాలలో బీటెక్ చదువుతున్నాడని తెలిసింది. సీఐ సత్యనారాయణ సొంత వాహనాలపై ప్రముఖుల పేర్లను రాసుకోవటం పోలీసులను తప్పుదోవ పట్టించటమే అని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఇటువంటి చర్యలకు ఎవరు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సత్యనారాయణ చెప్పారు. యేసురెడ్డి అనే పేరు మీద కారు రిజిస్టర్ అయిందని తెలుస్తోంది.

Related posts