telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జేడీయూ నుంచి బీజేపీలో ఆరుగురు ఎమ్మెల్యేలు జంప్…

Nitish kumar Bihar cm

ఈ మధ్యే బీహార్ లో ఎన్నికలు జరిగాయి. అందులో జేడీయూ, బీజేపీ కూటమి విజయం సాధించిన విశాతం తెలిసిందే. అయితే తాజాగా బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీష్‌ కుమార్‌కు షాక్ తగిలింది… జేడీయూకు గుడ్‌బై చెప్పిన ఆరుగురు ఎమ్మెల్యేలు.. భారతీయ జనతా పార్టీలో చేరారు.. అదేంటి? బీహార్‌లో జేడీయూ-బీజేపీ మిత్రపక్షాలు కదా? ఈ పరిణామాలు ఏంటి? అనే అనుమానాలు రావొచ్చు.. ఈ రాజకీయ పరిణామాలు జరిగింది మొత్తం అరుణాచల్ ప్రదేశ్‌… జేడీయూకు అరుణాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీలో ఏడుగురు ఎమ్మెల్యేలున్నారు.. అయితే, వారిలో ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారు.. దీంతో జేడీయూకు ఒకే ఒక్క ఎమ్మెల్యే మిగిలారు. అయితే, ఈ ఆరుగురిలో ముగ్గురు ఎమ్మెల్యేలపై నెలకిందే వేటు వేసింది జేడీయూ… పార్టీ నుంచి ఆ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ నోటీసులు కూడా జారీ చేసింది. కానీ, బీజేపీ-జేడీయూ మధ్య ఈ పరిణామాలు ఎలాంటి దూరాన్ని పెంచడంలేదనేది స్పష్టమైపోయింది.. ఎందుకుంటే.. ఈ వ్యవహారంపై స్పందించిన అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు బియురాం వాంఘే.. ప్రజలు అభివృద్ధివైపు నిలిచారు.. ముఖ్యమంత్రి పెమాఖండు, ప్రధాని మోదీ నాయకత్వంపై నమ్మకం ఉంచారని పేర్కొనగా.. ఈ ఘటనతో తాము ప్రతిపక్ష హోదాలోకి వెళ్లిపోయామని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగీ చెప్పుకొచ్చారు. చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది.

Related posts