telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీఎస్ఆర్.టి.సి ఇక నుండి.. ప్రజారవాణాశాఖ ..

apstrc as pdt under govt

ఏపీఆర్టీసీని ప్రభుత్వంలో విలీన ప్రక్రియను పూర్తి చేయడానికి సర్కారు ఆరుగురు సభ్యులతో ఒక కమిటీ ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి రవాణ శాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి, ప్రభుత్వ సంస్థల శాఖ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శులు సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఏపీఆర్టీసీ కి చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మిన్) మరో సభ్యుడిగాను, కన్వీనర్ గా వ్యవహరిస్తారు. ప్రజా రవాణా శాఖ (ప్రజా రవాణా శాఖ (పిటిడి) అనే నూతన శాఖను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీసిఎఫ్ ఎంఎస్ ద్వారా వేతనాలు చెల్లించే వెసులుబాటును ప్రభుత్వం కల్పిస్తుంది. రవాణా, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రజలనుండి విజ్ఞప్తులు స్వీకరించారు. శనివారం తన కార్యాలయంలో ప్రజలనుండి విజ్ఞప్తులు స్వీకరించారు.

ఆర్టీసీ విషయంలో జగన్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం మా కుటుంబాల్లో ఆనందాన్ని నింపిందని చెపుతున్నారు ఆర్టీసీ కార్మికులు. తమ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తు నిర్ణయం తీసుకోవడం ఆ వెంటనే జీతాల పెంపుదలపై దృష్టి పెట్టడం వెంట వెంటనే జరిగాయని తెలిపారు. ఏది ఏమైనా తెలంగాణ నుండి సొంత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వేరు పడటం తమకు ఆనందాన్ని ఇస్తోందని చెపుతున్నారు ఏపీఆర్టీసీ ఉద్యోగులు. ఒకవేళ ఇదే సమయంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉండి ఉంటే తమ బతుకులు ఇంకా ప్రైవేట్ వెట్టి చాకిరి బతుకులుగానే సాగేవని.. తెలంగాణ కార్మికులు ఇప్పుడు సమ్మె బాట పట్టిన విధంగా మేము సైతం మా సోదరులతో కలిసి సాగక తప్పని పరిస్థితి ఏర్పడేదని చెప్పారు.

Related posts