telugu navyamedia
రాజకీయ వార్తలు

తుపానును ఎదుర్కొనేందుకు కేంద్రం సహకరిస్తోంది: అమిత్ షా

amith shah bjp

ఎంఫాన్ తుపాను అంతకంతకూ బలపడుతున్నట్లు తెలుస్తోంది. బెంగాల్, ఒడిశా తీరంవైపు పెను తుపాను ఎంఫాన్ శరవేగంగా వస్తోంది. ఈ నేపథ్యంలో సదరు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో అమిత్ షా మాట్లాడుతూ,కేంద్ర ప్రభుత్వం మీకు అండగా ఉందని ఇరువురు ముఖ్యమంత్రులకు భరోసా ఇచ్చారు.

ఫోన్ ద్వారా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ లతో ఆయన మాట్లాడారు. తుపానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు.కేటగిరీ 5 హరికేన్ తో సమానమైన ఎంఫాన్ అంతకంతకూ బలపడుతోంది. రేపు అది తీరాన్ని దాటబోతోంది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతంలోని 50 లక్షలకు పైగా జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

Related posts