వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. కర్నూలు నగరంలోని సిల్వర్ జూబ్లీ కాలేజీ వద్ద ఫ్లైఓవర్‌పై సజ్జల కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
ఈ ఘటనలో కొన్ని వాహనాలు స్వల్పంగా దెబ్బతినగా.. సజ్జల సురక్షితంగా బయటపడ్డారు. వైసీపీ నేత నివాసంలో వివాహానికి హాజరై సజ్జల తిరిగి స్టేట్ గెస్ట్ హౌస్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
కర్నూలులోని డోన్ రోడ్డులో శనివారం పత్తికొండకు చెందిన వైసీపీ నేత మురళీధర్‌రెడ్డి కుమార్తె వివాహం జరిగింది. ఈ వేడుకకు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమం ముగించుకుని స్టేట్ గెస్ట్ హౌస్‌కు చేరుకునే మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.
సజ్జల కాన్వాయ్ ప్రమాదానికి గురయిందని తెలుసుకున్న వైసీపీ శ్రేణులు పెద్దయెత్తున గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు.
వాలంటీర్ల అరాచాకాలు ముఖ్యమంత్రికి కనిపించటం లేదా? – బండారు శ్రావణి