telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్ల అమ్మకాలపై ఏపీ ప్ర‌భుత్వం కొత్త గైడ్ లైన్స్..

*సినిమా టికెట్లపై 2% కమీషన్‌
*ప్రైవేట్ పోర్టల్స్‌ ద్వారా కొనుగోలు చేసినా తప్పదు
*ఇక హాల్‌ దగ్గర నో టికెట్లు ..ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జీవో

ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్ల అమ్మకాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలను జారీ చేసింది. సినిమా టికెట్ల విక్రయాలకు సంబంధించి ఇక‌పై ప్ర‌తి టికెట్‌పై 2 శాతం క‌మీష‌న్ వ‌సూలు చేయ‌నుంది. ఆంధ్రప్రదేశ్‌ ఫిలిం డెవలప్‌మెంట్‌​ కార్పొరేషన్‌

ఏపీ స్టేట్‌ ఫిల్మ్‌ టెలివిజన్‌ అండ్‌ థియేటర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లో టిక్కెట్లు విక్రయించేందుకు స‌న్నహాలు చేస్తోంది.

ఇకపై రాష్ట్రంలో ఏ థియేటర్లో సినిమా చూడాలన్నా ఇదే పోర్టల్‌ ద్వారా టికెట్లు కొనుగోలు చేయాలి. బుక్‌ మై షో లాంటి ఇతర ప్రైవేట్ పోర్టల్స్‌ ద్వారా కొనుగోలు చేసినా ప్రభుత్వానికి రెండు శాతం కమీషన్‌ చెల్లించాల్సి ఉంటుంద‌ని తెలిపారు.

ఆన్ లైన్ టికెట్ల అమ్మకాలకు సంబంధించిన మౌలిక సదుపాలను థియేటర్లే ఏర్పాటు చేసుకోవాలన్న ప్రభుత్వం.., ప్రతి థియేటర్లలో ఎటువంటి అవకతవకలు లేకుండా ఆన్ లైన్ టికెట్ల అమ్మకాలను పక్కాగా చేయాలని స్పష్టం చేసింది. కొత్త సినిమాకు వారం ముందు నుంచి మాత్రమే టికెట్లు అమ్మకాలు జరపాలని ప్రభుత్వం తెలిపింది.

కాగా..సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌ను నియంత్రించేందుకు ప్ర‌భుత్వ‌మే ఆన్ లైన్ ద్వారా టిక్కెట్లు విక్ర‌యించాల‌న్న ప్ర‌తిపాద‌న‌ను ఇటీవ‌ల చ‌ర్చానీయంశ‌మైంది.

ప్రభుత్వం తెచ్చిన ఆన్ లైన్ పోర్టల్ పై మల్టిప్లెక్స్ యాజమాన్యాలు హైకోర్టుకు వెళ్లగా ప్రభుత్వానికి మద్దతుగా ఆదేశాలిచ్చింది. ప్రభుత్వం ఆన్ లైన్లో టికెట్లు విక్రయించవచ్చని.. ఈ పద్ధతిని కొన్నాళ్లు పరిశీలించి చూద్దామని పేర్కొంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం తాజాగా టికెపై 2శాతం క‌మీష‌న్ తీసుకోవాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం.

Related posts