telugu navyamedia
ఆంధ్ర వార్తలు

సినిమాను అడ్డుపెట్టుకొని పార్టీని నిలబెట్టుకోవ‌డం క‌రెక్ట్ కాదు..

భీమ్లా నాయ‌క్‌ సినిమా, ఏపీ లో మూవీ టిక్కెట్స్ రే్ట్లు గురించి న‌గ‌రి ఎమ్మేల్యే రోజా స్పందించారు. పవన్ కల్యాణ్ ను తొక్కేయడం కోసం ప్ర‌చారం జ‌ర‌గ‌డం చాలా బాధాక‌ర‌మ‌ని అన్నారు.

ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత రోజా మీడియాతో మాట్లాడారు.. పవన్ సినిమాను తొక్కేయాల్సిన అవసరం తమకేంటి అని ఆమె ప్రశ్నించారు. ఆయన ఏమైనా నిర్మాతా? లేదా డిస్ట్రిబ్యూటరా? పవన్ కు ఎందుకు నష్టం జరుగుతుందని రోజా నిలదీశారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ ఒక్క‌టే గుర్తిపెట్టుకోవాలి తెలంగాణ‌లో 350 టిక్కెట్టు ఉంటే..ఏపీలో 150 టిక్కెట్ ఇచ్చి జ‌గ‌న్ మంచి చేశార‌ని రోజా అన్నారు. మా నియోజ‌క‌వ‌ర్గంలో కూడా మా ఫ్లెక్సీలు చించేసి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ గొడ‌వ చేశార‌ని రోజా అన్నారు..

పుష్ప, అఖండ, బంగార్రాజు సినిమాలకు ఏ టిక్కెట్ ధరలు ఉన్నాయో ఇప్పుడూ అవే టిక్కెట్ ధరలు ఉన్నాయని చెప్పారు. అలాంటప్పుడు ఒక్క భీమ్లా నాయక్ కు మాత్రమే అన్యాయం ఎలా జరుగుతుందన్నారు.

టికెట్ ధరల నిర్ణయం ఒక కొలిక్కకి వస్తుందనుకునే సమయంలో మంత్రి గౌతమ్ రెడ్డి మరణించడంతో కాస్త ఆలస్యం అయ్యింది.. ఈ లోగా సినిమా రిలీజ్ అయ్యింది, అని రోజా వివరణ ఇచ్చారు.

టిక్కెట్ ధరలపై నిర్ణయం వచ్చేంతవరకూ సినిమాను వాయిదా వేసుకోవాల్సిందని రోజా అన్నారు. లేదా రేట్లు పెంచుకోవాలనుకుంటే జాయింట్ కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోవచ్చని రోజా సూచించారు.

చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు తన సినిమాను అడ్డుపెట్టుకొని తమ పార్టీని నిలబెట్టుకోవాలని పవర్ రాజకీయంచేయ‌డం క‌రెక్ట్ కాద‌ని అన్నారు. ప్ర‌జ‌లు గ‌మ‌నించాలి..ఫ్యాన్స్ గ‌మ‌నించాల‌ని రోజా అన్నారు.

Related posts