ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేసిన అంశంపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ హైకోర్టుకు హాజరయ్యారు. తొలిసారిగా ఏపీ సీఎస్ కూడా కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు.
గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి వైసీపీ పార్టీకి చెందిన రంగులు ప్రభుత్వ కార్యాలయాలకు వేశారంటూ పిటిషన్ వేశారు. దీనిపై న్యాయస్థాయం విచారణ చేపట్టింది. కోర్టు ధిక్కారణ కింద ఆ రంగులు వేస్తున్నారని న్యాయస్థానం భావించింది. దీంతో విరణ ఇచ్చేందుకు సీఎస్ ఇవాళ కోర్టుకు వచ్చారు. ప్రభుత్వం తరపు వాదనలను విన్న కోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
దోపిడీదారులు నిప్పు కణికల్లా బిల్డప్ ఇస్తుంటారు: విజయసాయిరెడ్డి