యంగ్ హీరో అడివి శేష్ నటించిన చిత్రం ‘మేజర్’. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు, హిందీలో పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిన చిత్రమిది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.
భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జూన్3) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
26/11ముంబయి లోరి లష్కర్ ఈ తైయిబా సంస్థకి చెందిన పది మంది టెర్రరిస్ట్ లు ముంబయిలో తాజ్ హోటల్‌తోపాటు పలు ప్రాంతాల్లో దాడులు చేశారు. ఈ ఘటనలో 175 మంది అతిథులు, సాధారణ ప్రజలు మరణించగా, 300లకుపైగా గాయపడ్డారు. 9మంది టెర్రరిస్ట్ లను పోలీసులు(ఎన్‌ఎస్‌జీ కమాండోలు) మట్టుపెట్టారు. కసబ్ అనే టెర్రరిస్ట్ ని ప్రాణాలతో పట్టుకున్న విసయం తెలిసిందే. ఈ ఘటనలో మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ వీరమరణం పొందారు.
కథేంటంటే..
కేరళకు చెందిన ఇస్రో అధికారి కె ఉన్ని కృష్ణన్ (ప్రకాష్‌రాజ్) తనయుడు సందీప్ ఉన్ని కృష్ణన్(అడివి శేష్)..ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. చిన్నప్పటి నుంచి నేవీ అధికారి గా పనిచేయాలనే ఆయన కోరిక .కానీ అతని తండ్రికి(ప్రకాశ్ రాజ్) కొడుకుని డాక్టర్ చేయాలని, తల్లికి(రేవతి) ఇంజనీరింగ్ చదివించాలని కోరిక ఉంటుంది. నేవీకి అప్లికేషన్ పెట్టుకోగా, రిజెక్ట్ అవుతుంది. ఆ తర్వాత ఆర్మీలో జాయిన్ అవుతాడు.
ఆర్మీ ట్రైనింగ్‌లో సందీప్ అన్నింటిలోనూ ముందుంటాడు. తనకున్న టాలెంట్‌తో ఎన్‌ఎస్‌జీ కమాండో ట్రైనర్ గా ఎదుగుతాడు. ఎంతో మంది కమాండోలను తయారు చేస్తుంటాడు. ఎన్‌ఎస్‌జీలోనే సందీప్ ట్రైన్ చేసే టీమ్ నెంబర్ వన్ పొజీషియన్‌లో ఉంటుంది.
స్కూల్ రోజుల్లో ఇష్టపడిన ఇషా(సయీ మంజ్రేకర్)ని పెద్దలను ఒప్పించి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఉద్యోగరీత్య ఆమెతో ఎక్కువ సమయం గడపలేకపోతాడు. ప్రేమించి పెళ్ళి చేసుకున్న భర్త దూరంగా ఉండడంతో భర్య తట్టుకోలేపోతోంది. దీం తో వీరిమధ్య విభేదాలు కూడా వస్తాయి.
ఓసారి తను ఇంటికి వెళ్లేందుకు పై అధికారి(మురళీ శర్మ)దగ్గర అనుమతి తీసుకొని బెంగళూరు బయలుదేరుతాడు సందీప్. ఇదే సమయంలో 2008 నవంబర్ 26న జరిగిన ముంబై తాజ్ హోటల్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడతారు. ఆసమయంలో తన ప్రయాణాన్ని రద్దు చేసుకొని ‘51 ఎస్ ఎస్ జీ’బృందంతో కలిసి ముంబైకి వెళతాడు. తాజ్‌హోటల్‌పై దాడిచేసిన పాకిస్తాన్ ఉగ్రవాడులు అక్కడ విడిది చేసిన విదేశీయులను టార్గెట్ చేసి హతమార్చుతుంటారు. వారి దాడిలో 175 మంది మృతిచెందగా దాదాపు 300 మంది గాయపడతారు.
తాజ్ హోటల్‌లో దాగి ఉన్న ఉగ్రవాదులను సందీప్ ఎలా మట్టుపెట్టాడు? హోటల్‌లో బందీగా ఉన్న సామాన్య ప్రజలను ఎలా కాపాడాడు? ప్రజల ప్రాణాలను రక్షించేందుకు తన ప్రాణాలను ఎలా పణంగా పెట్టాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ..
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివిశేష్ పరకాయ ప్రవేశం చేశాడు. సినిమా మొదటి భాగం మొత్తం సందీప్ ఉన్నికృష్ణన్ చైల్డ్ నుంచి మేజర్‌గా ఎదిగిన తీరుని చూపించారు. ఈ క్రమంలో ఆయన ప్రేమ కథని హైలైట్ చేశారు . లవర్ బాయ్‌గా, మేజర్‌గా తన మార్క్ నటనని ప్రదర్శించి వాహ్ అనిపించాడు. ఇక తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ బెస్ట్ అని చెప్పొచ్చు. కథని నడిపించడంలో ఆయన పాత్ర చాలా కీలకం. క్లైమాక్స్ లో ఆయన చెప్పేడైలాగులు ఉత్తేజాన్ని కలిగిస్తాయి. తల్లిగా రేవతి కట్టిపడేశారు. ప్రియురాలిగా సాయీ మంజ్రేకర్ బాగా చేసింది. వర్షంలో బస్‌పై ఎక్కి ముద్దుపెట్టే సీన్‌లో అటు శేష్, సాయీ రెచ్చిపోయారు. అతిథిగా శోభితా ధూళిపాళ్ల మెప్పించింది. మురళీ శర్మ తన పాత్రకి న్యాయం చేశారు.
26/11 ఉగ్రదాడిలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ గురించి తెలియని విషయాలను భారతీయ ప్రేక్షకులకు తెరపై చూపించాడు. ముంబై దాడుల్లో మేజర్ ఉన్ని కృష్ణ ఎలా వీరమరణం పొందారో అందరికి తెలుసు. కానీ ఆయన ఎలా జీవించాడో ఈ సినిమాలో చూపించారు. ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి? బాల్యం ఎలా సాగింది? తల్లిదండ్రులపై ఆయనకు ఉన్న ప్రేమ, యవ్వనంలో ఉన్న లవ్‌స్టోరీ..ప్రాణాలకు తెగించి ఉగ్రమూకలను మట్టుబెట్టడం.. ప్రతీదీ కళ్లకు కట్టినట్లు చూపించారు. ఫస్టాఫ్ అంతా ఆయన బాల్యం, లవ్‌స్టోరీతో పాటు దేశం పట్ల ఆయనకు ఉన్న ప్రేమను, ఆర్మీలో చేరిన తర్వాత ఉన్నత స్థాయికి ఎదగడానికి పడిన కష్టాన్ని చూపించారు.
ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ మొత్తం ఎమోషనల్‌గా సాగుతుంది .తాజ్ హోటల్‌లో ఆపరేషన్ కోసం ఎన్‌ఎస్‌జీ కమాండోల బృందం అయిన అడివి శేష్ టీమ్ రంగంలోకి దిగుతుంది.ఇంటర్వెల్ తర్వాత తాజ్ హోటల్‌లో ఆపరేషన్ కోసం ఎన్‌ఎస్‌జీ కమాండోల బృందం అయిన అడివి శేష్ టీమ్ రంగంలోకి దిగుతుంది. తాజ్ హోటల్‌లోకి ప్రవేశించి నాలుగు రోజులపాటు టెర్రరిస్ట్ లతో పోరాడిన విధానాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు దర్శకుడు శశికిరణ్ తిక్క. ఇందులో మేజర్ సందీప్ నిర్ణయాలు, ఆయన చేసే యాక్షన్ హైలైట్‌గా ఉంటుంది. శేష్ పాత్ర చుట్టూతే సన్నివేశాలు తిరుగుతుంటాయి. మధ్య మధ్యలో తన భార్య సాయీ మంజ్రేకర్ సీన్లు, తల్లిదండ్రులు టెన్షన్ పడే సీన్లు చూపించి యాక్షన్ ఎపిసోడ్ల నుంచి రిలీఫ్‌ని కలిగిస్తుంటారు.
మరోవైపు సినిమా మొత్తం అడివి శేష్ పాత్ర చుట్టూనే సాగుతుండటంతో ఆయన నటనలో, పాత్రలో కొంత సహజత్వం మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. శేష్‌ని ఎలివేట్ చేసే క్రమంలో ఇంట్రెన్సిటీ మిస్ అవుతుంది. చివరల్లో సందీప్ పోరాడిన తీరు గూస్‌బంమ్స్ తెప్పిస్తాయి. క్లైమాక్స్ లో తన కుమారుడి గురించి తండ్రి(ప్రకాష్‌రాజ్) చెప్పే ఎమోషనల్ డైలాగ్‌లు గూస్‌బంమ్స్ ని తెప్పిస్తాయి.
ఇక టెక్నీషియన్ల విషయానికొస్తే..
ఈ సినిమాకు ప్రధానమైన బలం శ్రీచరణ్ పాకాల సంగీతం. తనదైన నేపథ్య సంగీతంతో సినిమాను మరోస్థాయిలో నిలబెట్టాడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ఫైట్ సీన్స్‌కి తనదైన బీజీఎంతో గూస్ బంప్స్ తెప్పించాడు. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది.
అబ్బూరి రవి డైలాగ్‌లు బాగున్నాయి. భారీ డైలాగ్‌లు లేకుండా సింపుల్‌గానే చెప్పినా ఎమోషనల్‌గా అనిపించాయి. . నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. ఆర్ట్ వర్క్ సినిమాకి హైలైట్. ఎక్కడా ఆర్టిఫీషియల్ ఫీలింగ్ కలగదు. సహజత్వం ఉట్టిపడేలా సెట్స్, గన్స్ ఉండటం విశేషం.
కాస్ట్యూమ్స్ తో సహ మైన్యూర్ డిటేయిల్స్ విషయంలోనూ చాలా కేర్ తీసుకున్నారు. ఆ విషయంలో టీమ్‌ని అభినందించాల్సిందే. టీమ్ హార్డ్ వర్క్ సినిమాలో ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. దర్శకుడు శశికిరణ్ తిక్క సినిమా కోసం పడ్డ కష్టం కనిపిస్తుంది.