telugu navyamedia
తెలంగాణ వార్తలు

ముగిసిన మేడారం జాత‌ర‌..

మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ముగిసింది. నాలుగు రోజుల పాటు ఘనంగా జరిగిన మేడారం జాతర.. అమ్మవార్ల వన ప్రవేశంతో ముగిసింది. గిరిజన సాంప్రదాయ పద్ధతిలో సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు వనప్రవేశం చేశారు.

చిలుకలగుట్టకు సమ్మక్క, కన్నెపల్లికి సారలమ్మ.. పూనుగొండ్లకు సమ్మక్క భర్త పడిగిద్దరాజు, కొండాయికి గోవిందరాజులను తరలించారు.కరోనా వైరస్‌ విజృంభన తర్వాత జరిగిన ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది.

జాతరకు ఒకటిన్నర కోటి మంది భక్తులు హాజరయ్యారని ప్రభుత్వం ప్రకటించింది. జాతర ముగిసినా అక్కడ ఏర్పాట్లు కొన్ని రోజులు ఉండనున్నాయి. జాతర ముగిసినా మేడారానికి భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేస్తామని మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి చెప్పారు

కాగా మేడారం జాతర కోసం ప్రభుత్వం రూ.75 కోట్లు ప్రకటించగా.. దేవాదాయశాఖ మరో రూ.10 కోట్లు మంజూరు చేయడంతో అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రులు ఎర్రబెల్లి, ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు.

Related posts