telugu navyamedia
రాశి ఫలాలు

ఫిబ్రవరి 20, ఆదివారం రాశిఫలాలు

మేషరాశి..

త‌ల‌పెట్టిన ప‌నులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సమాజసేవలో భాగస్వాములవుతారు. వాహనయోగం క‌లుగుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అనవసర ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ‌స్తుల‌కు అనుకూలంగా ఉంటుంది.

వృషభరాశి..

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చిన్న‌నాటి మిత్రుల‌ను మిత్రులను కలుస్తారు. ఇంటి వాతావరణం అద్భుతంగా ఉంటుంది. బంధువులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. ఆలోచనలు స్థిరంగా కొనసాగవు. ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఆలయాలను సందర్శిస్తారు.

మిథునరాశి..

కుటుంబ బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దూరప్రయాణాలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ధనం అధికంగా ఖ‌ర్చు అవుతుంది. వ్యాపారాల్లో అడ్డంకులు ఎదుర‌వుతాయి. ఆరోగ్యంపై జాగ్ర‌త్త వ‌హించ‌డం మంచిది. విద్యార్ధుల‌కు శ్ర‌మ‌కు త‌గ్గ ఫ‌లితం ఉంటుంది.

కర్కాటకరాశి..

కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. . విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి అధికమవుతుంది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. స‌మ‌యానికి సొమ్ము అందుతుంది. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

సింహరాశి..

వ్యవహారాలలో అవాంతరాలు ఏర్ప‌డ‌తాయి. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల జాగ్రత్త చూపించ‌డం మంచిది. కొత్త రుణయత్నాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనారోగ్యం బారిన ప‌డ‌తారు. వ్యాపారాలు గందరగోళ పరిస్థితి ఏర్ప‌డుతుంది..

కన్యరాశి..

రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తప్పవు. దూరపు బంధువుల రాకతో ఇంట్లో సంద‌డిగా మారుతుంది. ఉత్సాహంగా పనులు చక్కదిద్దుతారు. ఆర్ధిక అంత‌గా బాగుండ‌దు. సన్నిహితులతో వివాదాలు సర్దుకుంటాయి. వాహనయోగం క‌లుగుతుంది. నిరోద్యోగుల‌కు ఉద్యోగ‌వకాశాలు వ‌స్తాయి.వ్యాపారాలు మంద‌గిస్తాయి.

తులరాశి..

ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు. అనుకోని ప్రయాణాలు చేస్తారు. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. స్వల్ప అనారోగ్యం బారిన ప‌డ‌తారు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు మ‌ధ్య‌వ‌ర్తిలు మ‌ధ్య వివాదాలు త‌లెత్తుతాయి. అనుకోని ప్ర‌యాణాలు చేస్తారు.

వృశ్చికరాశి..

గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధువులు, సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగ‌స్తులు పదోన్నతుల విషయంలో మీ అధికారులతో చర్చలు జరుగుతాయి.

ధనుస్సురాశి..

వ్యాపారాలు సాఫీగా కొనసాగుతాయి. ముఖ్యులు నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. బంధువులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వ‌స్తుంది. వ్యాపారాల్లో ఊహించని మార్పులు వ‌స్తాయి. ఆల‌యాలు సంద‌ర్శిస్తారు.

మకరరాశి..

చిరు వ్యాపార‌స్తుల‌కు అనుకూలంగా ఉంటుంది. బంధువులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. కష్టానికి ఫలితం కనిపించదు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. రుణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్ప‌డుతుంది. వ్యాపారాలు సామాన్యస్థితిలో కొనసాగుతాయి.

కుంభరాశి..

ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. బంధువర్గంతో విభేదాలు త‌లెత్తుతాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. స్వల్ప అనారోగ్యం సూచ‌న‌. మిత్రుల నుంచి ఒత్తిడులు అధిక‌మ‌వుతాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

మీనరాశి..

వ్యాపారాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు ఉపాధ్యాయుల సహాయం అందుతుంది. తలపెట్టిన పని పూర్తి అవుతుంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారాలలో ఊహించని మార్పు క‌నిపిస్తుంది. ఆల‌యాలు సంద‌ర్శిస్తారు.

Related posts