telugu navyamedia
రాశి ఫలాలు

డిసెంబర్ 31, శుక్రవారం రాశి ఫలాలు..

డిసెంబర్ 31, శుక్రవారం రాశిఫలాలు

మేషరాశి..

అయిన‌వారి నుంచి ఒత్తిడులు ఏర్ప‌డ‌తాయి. తలకు మించిన భాధ్యతలతో లేని పోని ఇబ్బందులు తెచ్చుకుంటారు. దైవ ద‌ర్శ‌నాలు చేస్తారు. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఏర్ప‌డ‌తాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు.

వృషభరాశి..

ఆత్మవిశ్వాసంతో చేసే పనుల వల్ల మంచి జరుగుతుంది. బందువులు నుంచి శుభవార్తలు వింటారు. ప్రముఖులు పరిచయం. సంఘంలో గౌరవం ల‌భిస్తుంది. వాహనాలు కొంటారు. స్త్రీలు ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి యత్నాలు మొదలెడతారు.. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మిథునరాశి..

ఆకస్మిక ధన, వస్తులాభాలు క‌లుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు ఎదుర‌వుతాయి. విద్యార్ధులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు క‌నిపిస్తున్నాయి.పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు

కర్కాటకరాశి..

బంధువులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. ఆరోగ్య, కుటుంబసమస్యలు ఎక్కువ‌వుతాయి. మీరు ప‌ని చేసే చోట సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మ‌థ్య‌మంగా సాగుతాయి.

సింహరాశి..

కుటుంబ స‌భ్యుల‌తో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరపు బంధువులను క‌లుసుకుంటారు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తొలగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. కుటుంబసమస్యలు ఎదుర‌వుతాయి. అనారోగ్యం బారిన ప‌డ‌తారు. వ్యాపారాలలో మార్పులు చేర్పులు ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త సమస్యలు ఏర్ప‌డ‌తాయి.

కన్యరాశి..

ప‌నుల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు పనివారలతో చికాకలు తప్పవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నూతన ఉద్యోగయోగం క‌లుగుతుంది. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. భూవివాదాలు కొలిక్కి వస్తాయి.

తులరాశి..

ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. కొత్త రుణయత్నాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు ఏర్ప‌డ‌తాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ల‌క్ష సాధ‌న‌కు బాగా శ్రమించాలి. కుటుంబ‌స‌భ్యులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు.

వృశ్చికరాశి..

నిరుద్యోగులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. చిరు వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ముఖ్య‌మైన సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభ‌సాటిగా ముందుకుసాగుతాయి.

ధనుస్సురాశి..

బాగా ఆలోచించి ఏదైనా త‌ల‌పెట్ట‌డం మంచిది. మిత్రులతో కలసి ఆనందంగా గడుపుతారు. వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో గొడ‌వ‌లు వ‌స్తాయి. దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి నిలదొక్కుకుంటారు.

మకరరాశి..

పనులలో విజయం సాధిస్తారు. మానసిక అశాంతి క‌లుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. శుభవార్తలు అందుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ప్రయాణాలు సాఫీగా సాగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం అవుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు.

కుంభ‌రాశి..

రుణ విముక్తి పొందుతారు. ఊహించని ఖర్చులు అధిక‌మ‌వుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదుర‌వుతాయి. విలువైన సమాచారం అందుతుంది. స్నేహితులు, బంధువుల‌తో విందువినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగాలలో ప్ర‌మోష‌న్స్ అందుతుంది. దైవ ద‌ర్శ‌నాలు చేస్తారు.

మీనరాశి..

ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక విషయాలు మందగిస్తాయి. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. బంధువులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. దూరప్రయాణాలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

Related posts