telugu navyamedia
రాశి ఫలాలు

సెప్టెంబర్ 21(మంగళవారం) రాశి ఫలాలు

మేషం : ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. ఉద్యోగులకు అనుకూలం. మీ ప్రతిభను అధికారులు గుర్తిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి. చిరు వ్యాపారులకు లాభదాయకం. వివాహ సంబంధాలకు అనుకూలం.

వృషభం : ఆదాయంతో పాటు ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారులకు అనుకూలం. ఉద్యోగులు శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మిథునం : ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యానికి ఢోకా లేదు. చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తిచేస్తారు. వాహనం విషయంలో జాగ్రత్త అవసరం. పెద్దల సలహాను పాటించండి. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.

కర్కాటకం : ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. ట్రాన్స్‌పోర్ట్ రంగాల వారికి అనుకూలం. బ్యాంకు వ్యవహారాలలో అప్రమత్తత అవసరం. వివాదాలకు పోవద్దు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కష్టంమీద కొన్ని పనులు పూర్తిచేస్తారు.

సింహం : ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు శుభ ఫలితాలు. పాత బకాయిలు వసూలు అవుతాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శుభ వార్తలు వింటారు. స్త్రీలకు కొత్త పరిచయాలకు అవకాశం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

కన్య : ఆర్థికంగా పర్వాలేదు. అవసరానికి డబ్బు అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. చిరు వ్యాపారులకు లాభదాయకం. విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండండి. చేపట్టిన పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండండి.

తుల : ధనలాభం. వృత్తి, వ్యాపారులకు లాభదాయకం. కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

వృశ్చికం : ఆదాయంతో పాటు ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఉద్యోగులు అధికారుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వివాహ ప్రయత్నాలకు అనుకూలం.

ధనస్సు : ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు అదుపుచేసుకోవాలి. వృత్తి వ్యాపారులకు లాభదాయకం. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తిచేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఇతరుల సలహాలు తీసుకుంటారు. మీవల్ల ఇతరులకు మేలు జరుగుతుంది.

మకరం : అవసరానికి డబ్బు అందుతుంది. స్థిరాస్తి కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారులకు లాభదాయకం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

కుంభం : ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగులకు అనుకూల సమయం. వ్యాపారులకు లాభదాయకం. రుణ సమస్యలు తొలగిపోతాయి. స్నేహితులకు సహాయం చేస్తారు. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. బంధు మిత్రులను కలుసుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మీనం : ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వస్తుంది. ఎవరికీ హామీలు ఉండొద్దు. చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా మెలగండి.

Related posts