telugu navyamedia
రాశి ఫలాలు

న‌వంబ‌ర్ 17, బుధవారం రాశిఫ‌లాలు…

మేషరాశి..

ఉపాధ్యాయులకు పని భారం త‌గ్గుతుంది. లక్ట్రికల్, ఎలక్ట్రానికల్, మెకానికల్ రంగాల వారికి అంత‌గా క‌లిసిరాదు.. పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ ధైర్యంతో ముందుకుసాగుతారు. బంధుమిత్రుల నుంచి సహకారం లభిస్తుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాహనయోగం క‌లుగుతుంది.

వృషభరాశి..

కొబ్బరి, పండ్ల, పూల, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి. ధైర్యంతో ముందడుగు వేస్తే ఆశించిన ఫలితాలు వస్తాయి. ముఖ్య వ్యవహారంలో పెద్దలు, బంధుమిత్రుల నుంచి సాయం అందుతుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఇబ్బందులను ఎదుర్కుంటారు.

మిథునరాశి..

రుణ యత్నాల్లో ఆటంకాలు, చికాకులు ఎదుర్కుంటారు. విద్యార్థినులకు ఏకాగ్రతా లోపం వల్ల ఆందోళన అధికమవుతుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. పలు వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం మంచిది.

కర్కాటకరాశి..

రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆశించిన ఫలితాలు కనిపిస్తున్నాయి. బుద్ధిబలంతో కీలక సమస్యను పరిష్కరిస్తారు. ప్రాయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

సింహరాశి..

వైద్యులకు ఏకాగ్రత, మెళుకువ అవసరం. నిరుద్యోగులకు ఇంటర్వూలలో ఓర్పు, నేర్పు ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. అనుకున్నది సాధిస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి. భూవివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కన్యరాశి..

విద్యార్థులకు ప్రేమ వ్యవహారాలలో భంగపాటు తప్పదు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. మంచి ఆలోచనా విధానంతో ముందుకు సాగి పేరును గడిస్తారు. గొడవలకు దూరంగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు.ఇంజనీరింగ్, ఆడిట్ రంగాల వారికి గుర్తింపు లభిస్తుంది.

తులరాశి..

బంధువులు నుంచి ఆహ్వానాలు అందుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగితే ఆశించిన ఫలితాలు కలుగుతాయి. ప్రశాంతత కోసం సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి. బంధుమిత్రుల నుంచి సాయం అందుతుంది.

వృశ్చికరాశి..

ట్రాన్స్ పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి పరోభివృది. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించునపుడు జాగ్రత్త అవసరం. ఒక ముఖ్య వ్యవహారంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం అందుతుంది. అవసరానికి ఆర్థిక సహాయం లభిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. దైవదర్శనాలు చేస్తారు.

ధనుస్సురాశి..

విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. శుభవార్త సంతోషాన్ని నింపుతుంది. ముఖ్య వ్యవహారంలో బంధువుల నుంచి ఆర్థికసాయం అందుతుంది. ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి.స్త్రీలు టి.వి కార్య క్రమాలు, కళాత్మక పోటీల్లో రాణిస్తారు.

మకరరాశి..

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.కొబ్బరి, పండు, పూల వ్యవారులు లాభదాయకం. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కొన్ని పనుల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశముంది.

కుంభరాశి..

చేపట్టిన పనులు పూర్తవుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. తోటివారి సహకారంతో ఇబ్బందులను అధిగమిస్తారు. వాదనలకు దూరంగా ఉండాలి. రాజకీయ నాయకులను ప్రయాణాలలో మెళుకువ అవసరం. బ్యాంకు పనుల్లో జాష్యం ఇతర వ్యవహారాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. విందువినోదాలు పాల్గొంటారు.

మీనరాశి..

మీ జీవితభాగస్వామి విషయంలో దాపరికం మంచిది కాదు. ఓర్పు, పట్టుదలతో శ్రమించిన గాని అనుకున్న పనులు పూర్తి కావు. ఒత్తిడితో కూడిన ఫలితాలు ఉంటాయి. ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. క్షమాగుణంతో వ్యవహరిస్తే మేలు జరుగుతుంది.వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకులు త‌ప్ప‌వు..

 

Related posts