telugu navyamedia
ఆరోగ్యం

పిల్ల‌ల్లో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెర‌గాలంటే ఏం చేయాలో తెలుసా ?

పిల్లల్లో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెర‌గాలంటే సరైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత పేరెంట్స్ పైనే ఉంది. ముఖ్యంగా కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉన్న కార‌ణంగా మరింత అప్రమత్తంగా ఉండాలి. మీ ఇంట్లో వున్న‌ పిల్లలకు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కింద వివ‌రించిన విధంగా ఆహారం అంద‌జేస్తే స‌రిపోతుంది.

కోడిగుడ్డులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పిల్లలకు రోజూ ఒక ఉడికించిన గుడ్డు తినిపించాలి. కండరాలు, చర్మం, గుండె ఆరోగ్యానికి గుడ్డు మంచిది. పిల్లల ఎదుగుదలకు అవసరమైన విటమిన్‌ ఎ, బి2(రైబోఫ్లేవిన్‌) కోడిగుడ్డులో లభిస్తాయి.

One Egg Per Day Could Boost Babies' Brain Function

పెరుగులో ప్రోబయోటిక్స్‌, విటమిన్‌ బి12 లభిస్తాయి. ఇది పొట్టలో చెడు బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా కాపాడుతుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది.

ఆకుకూరలు, మునగకాయలు, కొత్తిమీర, పాలకూర వంటివి ఎక్కువగా పెట్టాలి. వీటిలో ఫైబర్‌తో పాటు ఐరన్‌, జింక్‌, మినరల్స్‌ లభిస్తాయి.

Selection Of Food Rich In Antioxidants And Vitamins And Mineral Sources Vegan Food On White Wooden Background Healthy Balanced Dieting Concept Ingredients For Cooking Top View Flat Lay Copy Space Stock Photo -

కాబట్టి పిల్లలు ఇష్టంగా తినేలా ఫ్రూట్‌ యోగర్ట్‌, వెజిటబుల్స్‌ రైతా, బూందీ రైతా రూపంలో ఇవ్వొచ్చు.

పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. పిల్లలకు రోజూ పసుపు ఆహారంలో ఇవ్వడం వల్ల ఆస్తమా, అలర్జీకి సంబంధించిన సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. పాలల్లో పసుపు వేసి తాగించడం అలవాటు చేయవచ్చు.

Turmeric Milk For Kids - Benefits Of Turmeric Milk For Babies, Toddlers, Children

బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, వాల్‌నట్స్‌, అప్రికాట్స్‌ వంటివి ఎక్కువగా తినిపించాలి. మెదడు ఎదుగుదలకు అవసరమైన పోషకాలు లభించడంతో పాటు పిల్లల్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది.

పిల్లలకు స్వీట్స్‌, పంచదార ఎక్కువగా ఉండే ఇతర పదార్థాలైన ఫ్రూట్‌జ్యూస్‌లు, చాక్లెట్స్‌, ప్యాకేజ్డ్‌ స్నాక్స్‌ను ఎక్కువగా తినిపించకూడదు. ఇవి ఇమ్యూనిటీని తగ్గిస్తాయి.

Dried Fruits And Nuts, Are These Good Or Bad For your Kid? | Parenting, Relationships

పిల్లలు రోజూ తగినంత నిద్రపోయేలా చూడాలి. ఉదయం ఒక గంటసేపైనా ఎండలో ఆడుకునేలా ప్రోత్సహించాలి. అప్పుడే పిల్ల‌ల్లో ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరుగుతుంది. ఆనారోగ్యం భారిన ప‌డ‌కుండా ఉంటారు.

Related posts