telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ ను ఏకవచనంతో పిలుస్తారా?.. టీడీపీ నేతల పై వాసిరెడ్డి పద్మ ఫైర్

vasireddy padma ycp

ప్రజలు అంత గొప్పగా గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్న జగన్ ను ఏకవచనంలో పిలుస్తారా? అని టీడీపీ నాయకులపై వైసీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. జగన్ ఓ ముఖ్యమంత్రి అనే విషయం కూడా గుర్తెరగకుండా నోటికొచ్చినట్టు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు జగన్ మోహన్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించారు. 151 స్థానాల్లో తిరుగులేని మెజారిటీ ఇచ్చారు. అలాంటి వ్యక్తిని ‘గారు’ అని పిలవడానికి మీకు మనసు రావడంలేదా అని నిలదీశారు.

ప్రజలకు గౌరవం ఇవ్వడమే ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందని హితవు పలికారు. ఈ రోజు మీరు ప్రజలు ఎన్నుకున్న నాయకుడి పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలు ఎన్నుకున్న నాయకుడు. ఈ దేశంలో ఎవరికీ రానంతగా 50 శాతం ఓటింగ్ తో ఆయన సీఎం పదవి లో ఉన్నారు. మీరు గెలిచిన స్థానాలన్నీ అత్తెసరు ఓట్లతో గెలిచారని ఎద్దేవా చేశారు.

Related posts