telugu navyamedia
క్రీడలు వార్తలు

వారికీ మరో కౌంటర్ ఇచ్చిన కోహ్లీ…

భారత్-ఇంగ్లాండ్ మధ్య రేపటినుండి చివరి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పిచ్ పై వస్తున్న విమర్శలను తోసిపుచ్చాడు. అయితే ఈ రెండు జట్ల మధ్య మేతేరా లో ఇంతకముందు జరిగిన పింక్ టెస్ట్ కేవలం రెండు రోజులోనే ముగియడంతో పిచ్ పై విమర్శలు ప్రారంభమయ్యాయి. ఈ పిచ్ మొదటి రోజు మొదటి ఓవర్ నుండే స్పిన్ కు సహకరించడంతో రెండు జట్లలో స్పిన్నర్లు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్ లో మొత్తం 30 వికెట్లు పడగా అందులో 27 వికెట్లు స్పిన్నర్లే తీశారు. ఇక తాజాగా ఈ విషయం పై కోహ్లీ స్పందిస్తూ.. మేము మ్యాచ్ గెలవడానికి ఆడుతాం.. అంతేకాని ఆటను తప్పకుండా 5 ర్పజులు కొనసాగించడానికి కాదు అని పేర్కొన్నాడు. 3వ టెస్టులో పిచ్‌తో ఎలాంటి ఇబ్బంది లేదని, నైపుణ్యాలు లేని బ్యాట్స్‌మెన్ ‌లేకపోవడమే సమస్య అం కోహ్లీ నొక్కిచెప్పారు. అంతేకాకుండా, మునుపటి ఆటలలో ఆడని ఆటగాళ్ల ప్రతిభ పై కేవలం ఒక ఆట ఆధారంగా నిర్ధారణకు రాకూడదని కోహ్లీ పేర్కొన్నాడు. అయితే న్యూజిలాండ్‌ తో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో స్థానాన్ని దక్కించుకోవడానికి భారత్ ఈ సిరీస్‌ను 2-1తో గెలుచుకోవాలి.

Related posts