telugu navyamedia
రాజకీయ వార్తలు

వైరస్ జాతులు టెర్రరిస్టుల చేతిలో పడే అవకాశం: ఐక్యరాజ్యసమితి ఆందోళన

United Nation praised India on fani cyclone

రోకనా మహమ్మారి అవకాశాలను కల్పించిందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశంలో చీఫ్ ఆంటోనియో గుటెరెస్ మాట్లాడుతూ ఉగ్ర మూకలకు వైరస్ జాతులను సొంతం చేసుకునే అవకాశాలున్నాయని అన్నారు. ఇదే జరిగితే ప్రపంచానికి పెనుముప్పు వాటిల్లుతుందని చెప్పారు. .కరోనాపై జరుగుతున్న పోరాటాన్ని ఒక తరం చేస్తున్న యుద్దంగా గుటెరెస్ అభివర్ణించారు.

కోవిడ్-19 అనేది ప్రథమంగా ఒక ఆరోగ్య సమస్య అయినప్పటికీ… దీని పర్యవసానాలు దానికి మించి ఉంటాయని చెప్పారు. ప్రపంచ శాంతి, భద్రతకు ఇది పెను ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని తెలిపారు. కరోనాపై పోరాటం సామాజిక అశాంతికి, హింసకు దారి తీసే అవకాశం ఉందని చెప్పారు.ఈ మమమ్మారి వల్ల ప్రపంచ దేశాల బలహీనతలుబయటపడ్డాయని అన్నారు. ఇది బయో-టెర్రరిస్ట్ దాడులకు ఒక దారిని చూపించే విధంగా ఉందని గుటెరస్ చెప్పారు.

Related posts