telugu navyamedia
సినిమా వార్తలు

నాకు అందమైన మనస్సున్న భర్త దొరికాడు : లీసా రే

lisare

మోడలింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లీసారే క్యాన్సర్‌ బారిన పడిన విషయం తెలిసిందే. క్రమంగా వ్యాధి నుంచి కోలుకున్న ఆమె… 2012లో తన ప్రియుడు జాసన్‌ డేహ్నిని పెళ్లాడారు. తాజాగా ఈ విషయాల గురించి కరీనాతో మాట్లాడిన లీసా రే.. ప్రాణాంతక వ్యాధి బారిన పడిన మహిళను స్వీకరించే భర్త లభించడం తన అదృష్టమన్నారు. ‘‘ నాకు అందమైన మనస్సున్న భర్త దొరికాడు. నన్ను పెళ్లి చేసుకుంటున్నందుకు థాంక్స్‌ బేబీ అని తనకు చెప్పాను. ఒకవేళ వ్యాధి మళ్లీ తిరగబెడితే చికిత్స కోసం వెళ్లాల్సి ఉంటుందని కూడా చెప్పాను. నేను ఊహించినట్లుగానే జరిగింది. అయితే తనతో ప్రయాణం నాలో మార్సులు తీసుకువచ్చింది. కేవలం 3 నెలల వ్యవధిలోనే కోలుకున్నాను’’ అని భర్తపై ప్రేమను చాటుకున్నారు. కాగా లీసా రే- జాసన్‌ డేహ్ని జంట సరోగసీ విధానంలో 2018లో కవల ఆడపిల్లలకు జన్మనిచ్చారు. ఇక తాను క్యాన్సర్‌ను జయించిన క్రమంలో ఎదురైన మానసిక సంఘర్షణ గురించి ‘క్లోజ్‌ టూ ది బోన్‌’ పేరిట లీసా రే పుస్తకరూపంలో తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే.

Related posts