telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

వరల్డ్ ఫేమస్ లవర్ .. ప్రేమికుల రోజునే …

World-Famous-Lover

అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ డైరక్షన్ లో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో ముగ్గురు క్రేజీ హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. మొన్నామధ్య ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో సర్ ప్రైజ్ చేసిన విజయ్ ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసి మరింత షాక్ ఇచ్చాడు.

ఈ చిత్రం ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున రిలీజ్ చేస్తున్నారట. ఇదో రకంగా విజయ్ ఫ్యాన్స్ కు పండుగ చేసుకునే వార్తే. సినిమాలో విజయ్ లవ్ ఫెయిల్యూర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. ముగ్గురు హీరోయిన్స్ ఉన్నా ముగ్గురితో విజయ్ లవ్ ఫెయిల్ అవుతుందట. ముఖ్యంగా ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేష్ మొదటి హీరోయిన్ గా నటిస్తుందట. రాశి ఖన్నా కూడా సెకండ్ హీరోయిన్ గా చేస్తుంది. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కె.ఎస్ రామారావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డియర్ కామ్రేడ్ తో మిస్సైన హిట్ టార్గెట్ ఈ సినిమాతో ఫుల్ ఫిల్ చేయాలని చూస్తున్నాడు మన రౌడీ హీరో. సినిమా పక్కా హిట్ కొట్టేలా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నారని తెలుస్తుంది. సినిమా ప్రమోషన్స్ కూడా కొత్తగా ప్లాన్ చేస్తున్నారట. సంక్రాంతి నుండే ఈ సినిమాకు ప్రమోషన్స్ మొదలు పెడతారని తెలుస్తుంది.

Related posts