telugu navyamedia
క్రీడలు వార్తలు

పృథ్వీ షాపై బాలీవుడ్ హీరోయిన్ సెటైర్‌…

ఐపీఎల్ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్‌ యువ బ్యాట్స్‌మన్‌ పృథ్వీ షా మెరుపు బ్యాటింగ్ చేస్తున్నాడు. దేశవాళీ సూపర్‌ ఫామ్‌ను ఇక్కడా కొనసాగిస్తూ బౌండరీలతో విజృంభిస్తున్నాడు. ఇక గత కోల్‌కతా మ్యాచ్‌లో పృథ్వీ షా ఏకంగా ఐదు అవార్డులు గెలుచుకున్నాడు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డుతో పాటు, సఫారీ సూపర్‌ స్టైకర్‌ అవార్డు, గేమ్‌ ఛేంజర్‌ అవార్డు , క్రెడ్‌ పవర్‌ ప్లేయర్‌ అవార్డు , అప్‌స్టాక్స్‌ మోస్ట్‌ వాల్యూబుల్‌ అసెట్‌ అవార్డు లు షా గెలుచుకున్నాడు. దీంతో షాపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో షా రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్‌, బాలీవుడ్ హీరోయిన్ ప్రాచి సింగ్‌ కూడా అభినందనలు తెలిపారు. పృథ్వీ షాను విష్‌ చేస్తూ.. ‘నిన్ను చూస్తే గర్వంగా ఉంది’ అని ప్రాచి సింగ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో రాసుకొచ్చారు. అయితే ఐదు అవార్డులు తీసుకోవడంపై ఓ సెటైర్‌ వేశారు. షా అందుకున్న అవార్డులన్నింటినీ కలిపి ఒక ఫోటోలో జత చేసిన ప్రాచి.. ‘ఆ అవార్డులు అన్ని తీసుకెళ్లడానికి కొత్త సూట్‌ కేసు కావాలేమో’ అని కామెంట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట వైరల్ అయ్యాయి. గత కొంతకాలంగా ప్రాచి సింగ్‌తో షా ప్రేమాయణం నడుపుతున్నాడనే వార్తలు షికార్లు చేశాయి.

Related posts