telugu navyamedia
రాజకీయ వార్తలు

మండేలా తనకు ఎల్లప్పుడు మార్గదర్శకుడు: ప్రియాంక గాంధీ

priyanka mandela

నెల్సన్‌ మండేలా తనకు ఎల్లప్పుడు ప్రేరణ కలిగించే మార్గదర్శకుడు అని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. తనను రాజకీయాల్లోకి రావాల్సిందిగా మొదటగా కోరింది నెల్సన్‌ మండేలానే అని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. నల్లజాతి సూరీడు, వర్ణవివక్ష వ్యతిరేక పోరాట యోధుడు నెల్సన్‌ మండేలా అని ప్రశంసించారు.

నేడు నెల్సన్‌ మండేలా 101వ జయంతిని పురస్కరించుకుని మండేలా తన కొడుకును ఎత్తుకొన్నప్పటి ఫోటోను ప్రియాంక తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ట్విట్టర్‌ లో ఆమె స్పందిస్తూ.. నెల్సన్‌ మండేలా వంటి గొప్ప వ్యక్తులను ప్రపంచం ఇప్పటికి మిస్‌ అవుతుందన్నారు. ఆయన జీవితం సత్యానికి, ప్రేమకు, స్వేచ్ఛకు ఓ పరీక్ష వంటిదన్నారు. తన వరకు ఆయన అంకుల్‌ నెల్సన్‌ అని ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు.

Related posts